కూటమికి బీటలు?.. హద్దుల్లో ఉండండి.. ప్రధానితో ట్విట్టర్ గేమ్ వద్దు: నితీష్ కుమార్ పార్టీకి బీజేపీ వార్నింగ్

By Mahesh KFirst Published Jan 17, 2022, 5:18 PM IST
Highlights

బిహార్‌లో అధికార కూటమిలో బీటలు పడుతున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ, జేడీయూ మధ్య వాగ్వాదాలు మొదలు అవుతున్నాయి. ప్రధాని మోడీతో ట్విట్టర్ ట్విట్టర్ గేమ్ ఆడటం సరికాదని, బిహార్ బీజేపీ చీఫ్ సెక్రెటరీ.. జేడీయూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కూటమిలో ఎవరి హద్దుల్లో వారు ఉండాలని సూచనలు చేశారు.  లేదంటే రాష్ట్రంలోని 76 లక్షల బీజేపీ కార్యకర్తలు వీరిపై తిరగబుడుతుందని హెచ్చరించారు.
 

పాట్నా: బిహార్‌(Bihar)లో అధికార పక్షం కూటమికి బీటలు పడుతున్నాయా? బీజేపీ(BJP)కి, నితీష్ కుమార్(Nitish Kumar) పార్టీ జేడీయూ(JDU)కు మధ్య వైరం వేడెక్కుతున్నదా? వీటి మధ్య అంతర్గత వైషమ్యాలు రచ్చకెక్కుతున్నాయా?.. తాజాగా, జేడీయూకు బీజేపీ ఇచ్చిన వార్నింగ్(Warning) చూస్తే అదే అనిపిస్తున్నది. ఎవరి హద్దులో వారు ఉండాలని సుతిమెత్తని బీహార్ బీజేపీ చీఫ్ సెక్రెటరీ సంజయ్ జైస్వాల్ వార్నింగ్ ఆచ్చారు. ప్రధానితో ట్విట్టర్, ట్విట్టర్ గేమ్ మానుకోవాలని సూచించారు. లేదంటే.. రాష్ట్రంలోని 76 లక్షల బీజేపీ వర్కర్లు గట్టి సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ఈ వార్నింగ్ పోస్టు చేశారు.

జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్, పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుష్వాహా ఇటీవలే ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. చక్రవర్తి అశోకుడిపై రచయిత దయా ప్రకాశ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చక్రవర్తి అశోకుడికి, ముగల్ చక్రవర్తి ఔరంగజేబుకు మధ్య సారూప్యతను తీయడానికి ప్రయత్నించిన రచయిత దయా ప్రకాశ్ సిన్హాపై బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆ దయా ప్రకాశ్ సిన్హాను అరెస్టు చేయకుండా.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ మండిపడ్డారు. ఎందుకు ఈ రాజకీయ నేతలు తనను, కేంద్ర నాయకత్వాన్ని ట్యాగ్ చేస్తున్నదని, ఎందుకు ప్రశ్నిస్తున్నారని ప్రశ్నించారు. ఒక కూటమి అన్నప్పుడు అందరూ ఎవరి లిమిట్‌లో వారు ఉండాలని అని సూచించారు. ఇది ఒకరి పక్షం తీసుకున్నట్టేమీ కాదని తెలిపారు. ఈ లిమిట్‌కు ఫస్ట్ కండీషన్ ఏమంటే.. దేశ ప్రధానితో ట్విట్టర్ ట్విట్టర్ ఆటలు ఆడరాదని వివరించారు. ఇకపైనా వారు అలాగే.. చేస్తే రాష్ట్రంలోని 76 లక్షల బీజేపీ కార్యకర్తలు దీటైన సమాధానం చెబుతారని హెచ్చిరించారు. కాబట్టి, మీరు భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

అవార్డులు వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రిని అడగడం అర్థరహితం అని ఆయన వివరించారు. మిత్రపక్షాలు ఒక సారి కూర్చుని విభేదాలను పారదోలుకోవచ్చని తెలిపారు. 2005కు ముందు సీఎం నివాసం అంటే.. హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు ఉండేవని, మళ్లీ అలాంటి పరిస్థితే రావాలని భావించట్లేదని వివరించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై జేడీయూ నేత ఉపేంద్ర కుష్వాహా స్పందించారు. తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. అవార్ు వెనక్కి తీసుకునే వారకూ తమ డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని వివరించారు.

బిహార్ గురించి ఇటీవలే ఆసక్తికర వార్త వచ్చింది. బిహార్ సీఎం నితీష్ కుమార్‌(Nitish Kumar)కు స్థిర, చరాస్తులు సుమారు రూ. 75.36 లక్షలు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, నితీష్ కుమార్ ఆస్తుల కంటే ఆయన కొడుకు ఆస్తులే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీ క్యాబినెట్ మంత్రుల ఆస్తులు తప్పకుండా వెల్లడించాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించారు. 

click me!