సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ ఆరోగ్యం విషమం

Siva Kodati |  
Published : May 29, 2021, 04:59 PM IST
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ ఆరోగ్యం విషమం

సారాంశం

కరోనా బారినపడిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది

కరోనా బారినపడిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు లక్నోలోని మేదాంత ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. సీతాపూర్ జైలులో ఉన్న ఆజంఖాన్ కరోనా బారినపడడంతో ఈ నెల 9న ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read:జయప్రదపై వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఆజాంఖాన్

గతనెల 30న తండ్రీకొడుకులిద్దరూ కరోనా బారినపడ్డారు. అయితే, ఈ నెల 9న ఆజంఖాన్ పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో తండ్రీకొడులిద్దరినీ మేదాంతాకు తరలించారు. దాదాపు వందకుపైగా కేసుల్లో నిందితులుగా ఉన్న అజాంఖాన్, ఆయన భార్య, కుమారుడు అబ్దుల్లా గతేడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో అలహాబాద్ కోర్టు అజామ్ ఖాన్ భార్య తజీన్ ఫాత్మాకు ఇటీవలనే బెయిల్ మంజూరు చేసింది

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !