‘క్షమించండి.. అవి కరోనా టీకాలని తెలియదు’.. దొంగిలించిన వ్యాక్సిన్లు తిరిగిచ్చిన దొంగ.. !!

By AN TeluguFirst Published Apr 23, 2021, 10:40 AM IST
Highlights

హర్యానాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 1700 వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగ వాటిని తిరిగి ఇచ్చేశాడు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హర్యానాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 1700 వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లిన దొంగ వాటిని తిరిగి ఇచ్చేశాడు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ క్రమంలో జింద్ లోని ఆస్పత్రిలో బుధవారం వ్యాక్సిన్లు దొంగతనానికి గురికావడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు అయితే సదరు దొంగ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తికి వ్యాక్సిన్ల పెట్టెను ఇచ్చాడు. 

తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని, తనకు వేరే పని ఉండటంతో ఆ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

పోలీసులు ఆ పెట్టెను తెరవగా వారికి కో వ్యాక్సిన్, కోవిషీల్డ్ వాక్సిన్ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది.  హిందీ లో ఉన్న ఆ ఉత్తరంలో ‘క్షమించండి.. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’ అని రాశాడు.

దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్ ఇవి ఇంజక్షన్లు అనుకుని వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వాటిని తిరిగి ఇచ్చిన దొంగ సహృదయానికి మెచ్చుకుంటున్నారు. అయినా ఆ దొంగమీద  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

click me!