సోనూసూద్ పై ఐటీ దాడులు : రియల్ హీరోకు వెల్లువెత్తుతున్న నెటిజన్ల మద్ధతు

By AN TeluguFirst Published Sep 16, 2021, 12:30 PM IST
Highlights

ఇంతలా సమాజసేవ చేస్తున్న నటుడి మీద అతని ఆస్తుల మీద జరిగిన దాడులు అతని అభిమానులు, మద్దతుదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. సోనూకు మద్దతు ఇచ్చే పోస్టులు, మీమ్‌లతో ఇంటర్నెట్ నిండిపోయింది. 

న్యూఢిల్లీ :  నటుడు సోనూసూద్‌కు సంబంధించిన  6 ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం దాడి చేశారు. ముంబై, లక్నోల్లోని సోనూసూద్ కి సంబంధించిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిగాయి. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సోనూ సూద్ 'మెస్సీయా'గా ఖ్యాతి గడించారు, వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లడానికి బస్సులు ఏర్పాటు చేయడంతో మొదలు పెట్టి,  కోవిడ్ -19 రోగులకు ఔషధాలను అందించడం, హాస్పిటల్ బెడ్‌లు ఏర్పాటు, ఆక్సీజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడం లాంటి సహాయాలు అనేకం చేశారు సోనూసూద్. రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు కరోనా సంక్షోభం, మహమ్మారి కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి కూడా నటుడు ఉద్వేగంగా మాట్లాడాడు. వారికి  విద్యను స్పాన్సర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సోనూసూద్ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు, 20 గంటలపాటు శోధన..

ఇంతలా సమాజసేవ చేస్తున్న నటుడి మీద అతని ఆస్తుల మీద జరిగిన దాడులు అతని అభిమానులు, మద్దతుదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. సోనూకు మద్దతు ఇచ్చే పోస్టులు, మీమ్‌లతో ఇంటర్నెట్ నిండిపోయింది. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. 48 ఏళ్ల ఈ నటుడిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'దేశ్ కా మెంటర్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది, దీని కింద విద్యార్థులు తమ కెరీర్ ను ఎంచుకునేలా మార్గనిర్దేశనం చేస్తారు.

ఆయనకు మద్దతుగా ట్విటర్ లో #IndiaWithSonuSood ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సోనూసూద్ పంజాబ్ కే కాదు దేశానికే రియల్ హీరో అని ఒకరు ట్వీట్ చేశారు. సోనూసూద్ రియల్ లైప్ సూపర్ మ్యాన్ అని, అతను గుడ్డి భక్తుడు కాదు నిజమైన భక్తుడని.. అనేక రకాల కామెంట్లతో నెటిజన్లు సోనూసూద్ కు మద్దతు తెలపుతున్నారు. 

click me!