ఇండియాలో గత 24 గంటల్లో 30,570 కొత్త కరోనా కేసులు: కేరళలోనే 17,681 కేసులు

Published : Sep 16, 2021, 10:13 AM IST
ఇండియాలో గత 24 గంటల్లో  30,570 కొత్త కరోనా కేసులు: కేరళలోనే 17,681 కేసులు

సారాంశం

 ఇండియాలో  మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుంది. కేరళ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు రికార్డు అవుతున్నాయి. గత 24 గంటల్లో 30,570 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజులుగా నమోదౌతున్న కేసులతో పోలిస్తే నిన్నటి కేసులు పెరిగాయి.

న్యూఢిల్లీ:ఇండియాలో గత 24 గంటల్లో 30,570 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 431 మంది మరణించారు. కరోనా నుండి నిన్న ఒక్క రోజే 38,303 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా దేశంలో 40 వేల కంటే కరోనా కేసులు తక్కువగా నమోదౌతున్నాయి.30 వేల కంటే తక్కువగా గత నాలుగు రోజులుగా కేసులు నమోదయ్యాయి. కానీ ఇవాళ అనుహ్యంగా 38,303 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో కేరళ రాష్ట్రంలోనే 60 నుండి 70 శాతం కరోనా కేసులు నమోదౌతున్నాయి.నిన్న ఒక్క రోజే కేరళ రాష్ట్రంలో 17,681 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో 208 మంది మృత్యువాత పడ్డారు.దేశంలో ఇప్పటివరకు 3,33, 47,325 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు కరోనా నుండి 3,42,923 మంది రోగులు కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా తో 4,43,928 మంది చనిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu