గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ కావాలంటూ.. సోనూసూద్ కి రిక్వెస్ట్..!

Published : Jun 24, 2021, 10:24 AM IST
గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ కావాలంటూ.. సోనూసూద్ కి రిక్వెస్ట్..!

సారాంశం

సోషల్ మీడియాలో అడగడం ఆలస్యం.. తానున్నాంటూ అందరికీ సాయం చేయడంలో సోనుసూద్ ముందుంటున్నాడు

ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వ్యక్తుల్లో  సినీ నటుడు సోనూసోద్ ఒకరు. సాయం కావాలంటూ ఎవరైనా సోషల్ మీడియాలో అడగడం ఆలస్యం.. తానున్నాంటూ అందరికీ సాయం చేయడంలో సోనుసూద్ ముందుంటున్నాడు. దీంతో.. చాలా మంది ఆయనను సాయం కోరడం గమనార్హం. తమకు ఏది కావాలన్నా.. ప్రభుత్వం కన్నా ముందు.. సోనూసూద్ ముందు ఉంచుతున్నారు. తాజాగా.. ఓ యువకుడు ఏకంగా ఐఫోన్ కావాలంటూ కోరడం గమనార్హం.

తాజాగా ఒక నెటిజన్ రోటీన్ కు భిన్నమైన కోరికను సోనూ ఎదుట ఉంచారు. ‘బ్రదర్.. నా గర్ల్ ప్రెండ్ ఐఫోన్ అడుగుతోంది. మీరేమైనా సాయం చేయగలరా’ అంటూ అడిగేశాడు. దీనికి సోనూ నుంచి వచ్చిన సమాధానం కర్ర కాల్చి వాత పెట్టేట్లు ఉండటం గమానార్హం. ‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కానీ.. నేను ఆమెకు ఐఫోన్ ఇవ్వటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు’’ అంటూ బదులిచ్చారు. దీనికి ఒక ఏమోజీని జత చేశారు.

ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సోనూసూద్ ఇచ్చిన రిప్లే కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే.. సదరు యువకుడు ఇలా అడగటాన్ని మాత్రం చాలా మంది తప్పు పడుతున్నారు. కొందరికి ఏం సాయం అడగాలో కూడా తెలియదు. వారి మనసులో ఏది అడగాలనిపిస్తే.. అది అడుగుతారు.. సోనూ అదిరే సమాధానం ఇచ్చారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అపదలో ఉన్న వారికి.. కష్టంలో ఉన్నోళ్లకు అండగా నిలుస్తున్న సోనూ లాంటి వారిని అడిగే కోరికేనా ఇది? అన్న క్వశ్చన్ ను పలువురు సంధిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?