ఎంపీ కే టోకరా... నకిలీ ఐఏఎస్ గుట్టు రట్టు..!

By telugu news teamFirst Published Jun 24, 2021, 8:37 AM IST
Highlights

మామూలుగా అయితే టీకా తీసుకోగానే.. ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అలా ఆమెకు రాకపోవడంతో అనుమానం కలిగింది. టీకా ధ్రువపత్రం గురించి అడిగినా దేవాంజన్ నుంచి సరైన సమాధానం రాలేదు. 

ఓ నకిలీ ఐఏఎస్ అధికారి ఏకంగా... ఎంపీకే టోకరా ఇవ్వాలని ప్రయత్నించాడు.  అయితే... ఎంపీ తెలివిగా వ్యవహరించడంతో... ఆ నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టు రట్టు అయ్యింది. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్ కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్ నంటూ నమ్మించి.. దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి .. టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిని కలిశాడు. కాస్బా ప్రాంతంలో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు... దానికి హాజరు కావాలని ఆమెను ఒప్పించాడు. అందుకు సేరనన్న ఆమె... ఆ కార్యక్రమానికి హాజరై.. ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు టీకా కూడా వేయించుకుంది.

మామూలుగా అయితే టీకా తీసుకోగానే.. ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అలా ఆమెకు రాకపోవడంతో అనుమానం కలిగింది. టీకా ధ్రువపత్రం గురించి అడిగినా దేవాంజన్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో... ఏదో తేడాగా ఉందనే అనుమానం ఆమెకు కలిగింది. వెంటనే తనతోపాటు టీకా వేయించుకున్న ఇతరులను కూడా ఆమె ఆరా తీసింది. వారికి కూడా ఎలాంటి మెసేజ్ రాలేదని ఆమె గుర్తించింది.

వెంటనే ఆమెపోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు దేవాంజన్ ను నకిలీ ఐఏఎస్ గా గుర్తించి.. అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటనపై ఎంపీ మిమి చక్రవర్తి స్పందించింది. 

‘టీకా వేయించుకోవడం మంచి పని కాబట్టి.. అతని ఆహ్వానాన్ని మన్నించి వెళ్లాను. టీకా విషయంలో అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో.. నేను కూడా టీకా తీసుకున్నాను. కానీ.. ఆ తర్వాత ఫోన్ కి మెసేజ్ రాకపోవడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని ఆమె పేర్కొంది. 

click me!