ఐసీయూలో ఎలుక కొరికిన రోగి మృతి

Published : Jun 24, 2021, 09:54 AM IST
ఐసీయూలో ఎలుక కొరికిన రోగి మృతి

సారాంశం

ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసన్ కు కంటి వద్ద ఎలుక కరిచింది. తన సోదరుడికి ఎలుక కరిచిన తర్వాత బుధవారం రాత్రి 8 గంటల వరకు చూడటానికి అనుమతించలేదని, ఆ తర్వాత మరణించారని చెప్పారని యశోద విలపిస్తూ చెప్పారు.

చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ రోగి... అక్కడ ఎలుక కొరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయి నగరంలోని రాజవాడి ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుక కాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసన్ మెనింజైటీస్, కాలేయ సమస్యలతో బాధపడుతూ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతున్న రాజవాడి ఆస్పత్రిలో చేరారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసన్ కు కంటి వద్ద ఎలుక కరిచింది. తన సోదరుడికి ఎలుక కరిచిన తర్వాత బుధవారం రాత్రి 8 గంటల వరకు చూడటానికి అనుమతించలేదని, ఆ తర్వాత మరణించారని చెప్పారని యశోద విలపిస్తూ చెప్పారు. తన సోదరుడికి జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని, దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యశోద డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి రాజావాడి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ విద్యాఠాకూర్ అందుబాటులో లేరు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu