Sonia: కర్ణాటక ప్రజలందరికీ సోనియా కృతజ్ఞతలు.. ఇంతకీ వీడియో సందేశంలో ఏమన్నారంటే..

Published : May 20, 2023, 10:59 PM IST
Sonia: కర్ణాటక ప్రజలందరికీ సోనియా కృతజ్ఞతలు.. ఇంతకీ వీడియో సందేశంలో  ఏమన్నారంటే..

సారాంశం

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించినందుకు కర్ణాటక ప్రజలందరికీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.

Sonia Gandhi: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. ఏకంగా 135 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. గత వారం రోజులుగా సీఎం పీఠాన్ని ఎవరూ అధిష్టించనున్నారనే తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా, రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో నేడు సిద్ధరామయ్య పదవీ ప్రమాణం చేశారు. సిద్ధరామయ్య కర్ణాటక సీఎం పీఠం అధిష్ఠించడం ఇది రెండోసారి. 

ఇదిలాఉంటే.. కర్నాటకలో నూతనంగా కొలువదీరిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం ఓ వీడియో సందేశాన్ని పంపింది. సోనియాగాంధీ మాట్లాడుతూ... "కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించినందుకు కర్ణాటక ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజానుకూల ప్రభుత్వం, పేదల అనుకూలమైన ప్రభుత్వం. ఈ విజయం విభజన, అవినీతి రాజకీయాల తిరస్కరణ. ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని కర్ణాటక ప్రజలకు నేను భరోసా ఇస్తున్నాను. మా ఐదు హామీలను తక్షణమే అమలు చేసేందుకు తొలి కేబినెట్ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు నేను గర్విస్తున్నాను. కర్ణాటక శ్రేయస్సు, శాంతి, పురోగతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. జై హింద్." అంటూ కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే పార్టీకి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ఇతర ఎమ్మెల్యేలలో కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.

అంతకుముందు రోజు కొత్తగా ఎన్నికైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పార్టీ ఇచ్చిన ఐదు హామీల అమలుకు మొదటి కేబినెట్ మీటింగ్ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

ఇంతకీ ఆ ఐదు హామీలేంటీ..? 

>> అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి).

>> ప్రతి కుటుంబానికి (గృహ లక్ష్మి) మహిళకు నెలవారీ ₹ 2,000 సహాయం.

>> BPL కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల బియ్యం ఉచితంగా (అన్న భాగ్య).

>> నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు ప్రతి నెల ₹ 3,000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు (ఇద్దరూ 18-25 వయస్సు గలవారు) రెండేళ్లపాటు (యువ నిధి) ₹ 1,500.

>> పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో (ఉచిత ప్రయాణం) మహిళలకు ఉచిత ప్రయాణం.

ఈ కార్యక్రమంలో గాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. శరద్ పవార్, కమల్ హాసన్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ),మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) వరుసగా 66, 19 సీట్లు గెలుచుకున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్