అవిశ్వాసం ఎఫెక్ట్: కాంగ్రెస్ ఉరుకులు పరుగులు.. ఎంపీలతో సోనియా అత్యవసర సమావేశం

Published : Jul 19, 2018, 10:35 AM IST
అవిశ్వాసం ఎఫెక్ట్: కాంగ్రెస్ ఉరుకులు పరుగులు.. ఎంపీలతో సోనియా అత్యవసర సమావేశం

సారాంశం

అవిశ్వాసం విషయంలో టీడీపీకి మద్ధతుగా నిలబడినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కాస్తయినా క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. శుక్రవారం నుంచి సభలకు విధిగా హాజరవ్వాలని.. అవిశ్వాసం సందర్భంగా చర్చలో పాల్గొవాలని ఇప్పటికే ఎంపీలకు విప్  జారీ చేసింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పెట్టడంతో దేశ రాజధానిలో రాజకీయాలు వేడేక్కాయి. దేశం మొత్తం రేపు ఏం జరగబోతోందోనని ఆసక్తిగా గమనిస్తోంది. ఈ విషయంలో టీడీపీకి మద్ధతుగా నిలబడినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కాస్తయినా క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. శుక్రవారం నుంచి సభలకు విధిగా హాజరవ్వాలని.. అవిశ్వాసం సందర్భంగా చర్చలో పాల్గొవాలని ఇప్పటికే ఎంపీలకు విప్  జారీ చేసింది.

దీనితో పాటుగా ఇతర పార్టీల మద్ధతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. మరోవైపు శుక్రవారం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు సోనియా గాంధీ. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమె ఎంపీలతో .. యూపీఏ పక్షాలతో చర్చలు జరుపుతారు..

ఈ సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గేలు ఇతర పార్టీల నేతలను కలవనున్నారు. ఎన్డీఏకు మెజారిటీ ఉంది.. అవిశ్వాసం వీగిపోతుందన్న ప్రశ్నకు  ప్రతిపక్షాలకు ‘‘ సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారు ’’ అంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది..

PREV
click me!

Recommended Stories

అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?
వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu