అవిశ్వాసంపై బాబు ఫోకస్.. ఎంపీలకు తోడుగా ఢిల్లీకి ఏపీ మంత్రులు, అధికారులు

First Published Jul 19, 2018, 10:16 AM IST
Highlights

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో తమదైన బాణీ వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిసారించారు

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో తమదైన బాణీ వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రధానంగా పేర్కొన్న అంశాలపై చర్చ మొదలెట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న అధికారులు, మంత్రులను ఎంపీలకు తోడుగా ఉండటానికి ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు.

ప్రధానంగా ప్రత్యేకహోదా. పోలవరం, అమరావతి, కడప స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్‌పై బీజేపీని నిలదీయాలని తెలుగుదేశం భావిస్తోంది. అధికారంలో వచ్చిన నాటి నుంచి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన నిధులను లెక్కలతో సహా సభ ముందు ఉంచాలని చంద్రబాబు ఎంపీలకు తెలిపారు.

మరోవైపు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు కూడా టీడీపీ అధినేత తెరవెనుక పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మిగిలిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ను టీడీపీ ఎంపీలు కలిసి రేపు సహకరించాలని కోరారు.

click me!