Nitish Kumar: నితీశ్ కుమార్‌కు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: లాలు ప్రసాద్.. జేడీయూ రియాక్షన్ ఇదే

By Mahesh K  |  First Published Feb 16, 2024, 6:13 PM IST

నితీశ్ కుమార్‌కు తమ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ వద్ద నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ మీడియాకు కనిపించారు. ఈ విషయంపై జేడీయూ స్పందించింది.
 


Bihar: రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ద్వారాలు ఎల్లప్పుడూ తెరిసే ఉంటాయని తెలిపారు. నితీశ్ కుమార్ ఇటీవలే ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. వెనువెంటనే ఆయన సీఎంగా రాజీనామా చేసి ఎన్డీయే ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పరిణామంపై లాలు ప్రసాద్ యాదవ్ ఇది వరకు స్పందిచలేదు.

నితీశ్ కుమార్ రెండో సారి ఆర్జేడీకి షాక్ ఇచ్చారు. రెండు సార్లు లాలు యాదవ్ కొడుకు, ఆయన రాజకీయ వారసుడైనా తేజస్వీ యాదవ్‌కు దెబ్బ పడింది. రెండు సార్లు ఆయన డిప్యూటీ సీఎం పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా వారిద్దరూ గురువారం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ కనిపించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యాక లాలు ప్రసాద్ యాదవ్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. అయితే.. ఆర్జేడీ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న మనోజ్ ఝా, సంజయ్ యాదవ్‌లను ఉత్సాహపరిచేందుకు ఆయన విధాన సభకు వచ్చారు. ఈ సందర్భంలోనే నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ఎదురుపడ్డారు. వీరి స్నేహం స్టూడెంట్ పాలిటిక్స్ (1970వ దశకం) నుంచి ఉన్నది. 

Latest Videos

Also Read: YS Sharmila: కాంగ్రెస్‌తో వైసీపీకే కాదు.. టీడీపీకి కూడా ముప్పేనా? టీపీసీసీ రూటులోనే ఏపీ కాంగ్రెస్!

ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కూడా నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ మధ్య స్నేహం కొనసాగుతున్నదా? అని విలేకరులు ప్రశ్నించగా.. లాలు ప్రసాద్ యాదవ్ సమాధానం ఇచ్చారు. ‘ముందు నితీశ్ కుమార్ తమ వద్దకు రానివ్వండి. ఆ తర్వాత మీకు అన్నీ కనబడతాయి’ అని లాలు చెప్పారు. నితీశ్ కుమార్‌కు తమ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని వివరించారు.

కాగా, లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై జేడీయూ కూడా రియాక్ట్ అయింది. ‘లాలు జీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ, మా నాయకుడు నితీశ్ కుమార్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. తమతో అధికారాన్ని పంచుకున్న ప్రతిసారీ ఆర్జేడీ అవినీతిలో మునిగిందని చెప్పారు. జేడీయూ మళ్లీ ఆర్జేడీతో కలిసే అవకాశమే లేదు’ అని జేడీయూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ తెలిపారు.

click me!