కోడలితో మామ అక్రమ సంబంధం: మహిళ భర్త చేసిన పని ఇదీ....

Published : Jul 27, 2020, 08:27 AM IST
కోడలితో మామ అక్రమ సంబంధం: మహిళ భర్త చేసిన పని ఇదీ....

సారాంశం

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తండ్రిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని అన్నానగర్ లో చోటు చేసుకుంది. నిందితుడు వేలన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తండ్రిని కుమారుడు శనివారం హత్య చేశాడు. కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలో గల కృష్ణాపురం ఎెంకె నగర్ కు చెందిన మునియప్పన్ కూలీ పనులు చేస్తుంటాడు. 

అతనికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారికి వివాహాలు జరిగాయి. భార్య మరణించడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న కుమారుడు వేలన్ (45) కూలీ పనులు చేస్తున్నాడు. అతనికి మల్లిక (40) అనే భార్య ఉంది.

వేలన్ శుక్రవారంనాడు మద్యం సేవించి తండ్రిని చూడడానికి వెళ్లాడు. అక్కడ నిద్రపోతున్న తండ్రి మునియప్పన్ మీద రాయి వేసి చంపేశాడు. తర్వాత తండ్రిని హత్య చేసినట్లు తన సోదరుడికి తెలిపాడు. దానిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేలన్ ను అరెస్టు చేశారు. 

తన భార్య మల్లికతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వద్దని చెప్పినా వినలేదని వేలన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. తానే తండ్రిని హత్య చేసినట్లు వేలన్ అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌