కరోనాపై శాస్త్రవేత్తల మాట: తెలుగు రాష్ట్రాల్లో ముందుంది ముసళ్ల పండుగ

By Sreeharsha Gopagani  |  First Published Jul 27, 2020, 7:24 AM IST

దక్షణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో కేసులు పీక్ ని రీచ్ అవడానికి  సమయం పడుతుందని,సెప్టెంబర్ మధ్యవారంలో దక్షిణాది పీక్ ని చూసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు


భారత్ లో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. కరోనా వైరస్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కేసులు సంఖ్యానానాటికి పెరిగిపోతుండడంతో అందరూ కూడా కరోనా వైరస్ పీక్ కి ఎప్పుడు చేరుకుంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

తొలుత ఈ వైరస్ పీక్ మే చివరినాటికి అని అన్నప్పటికీ....  పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి మాత్రమే ఇప్పట్లో పీక్ ఉండబోదు అని చెప్పారు. ఆయన లెక్కల ప్రకారంగా ఒక్కో రాష్ట్రం ఒక్కోసారి పీక్ ని సాధిస్తుందని అన్నారు. సెప్టెంబర్ మధ్య కాలం నాటికి కరోనా వైరస్ కేసులు పీక్ కి చేరుకుంటాయని ఆయన అన్నారు. 

Latest Videos

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ మూర్తి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. భారత్ వంటి పెద్ద దేశాల్లో ఒకేసారి పీక్ కి కేసులు చేరుకోలేవని, ఒక్కో రాష్ట్రంలో ఎప్పుడెప్పడు ప్రజలు ఈ వైరస్ బారిన పడడం ప్రారంభమయ్హయిందనే విషయాలను పరిగణలోకి తీసుకొని లెక్కగట్టాలని అన్నారు మూర్తి. అందువల్ల ఒక్కో రాష్ట్రానికి పీక్ ఒక్కోసారి వస్తుందని అభిప్రాయపడ్డారు. 

ఢిల్లీ ఒక్కటే అన్నిటికంటే ముందు పీక్ ని చూస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నెలాఖరు, లేదా ఆగష్టు తొలివారంలో ఢిల్లీలో కేసులు పీక్ కి చేరుకుంటాయని, ఆ తరువాత నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

దక్షణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో కేసులు పీక్ ని రీచ్ అవడానికి  సమయం పడుతుందని,సెప్టెంబర్ మధ్యవారంలో దక్షిణాది పీక్ ని చూసే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పిన లెక్కలు కూడా ఇవే!

దక్షణాది రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, సెప్టెంబర్ నెల మధ్యభాగం నాటికి కేసులు ఈ స్థాయిలో నమోదు కావని, అప్పటికి తగ్గుముఖం పడతాయని అంటున్నారు. వేగంగా కేసులు పెరిగిన తమిళనాడులో మాత్రం కరోనా వైరస్ కేసుల పీక్ తొందరగా వచ్చే ఆస్కారం ఉందని, ఆగష్టు నెలాఖరునాటికి లేదంటే సెప్టెంబర్ మొదటివారం నాటికి తమిళనాడు లో కేసులు పీక్ కి చేరుకుంటాయని వెల్లడించారు. 

మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికుల వల్లనే తమిళనాడు, కర్ణాటకల్లోమ్ కేసులు పెరిగినట్టు తెలుస్తుంది. అప్పటినుండి ఆయా రాష్ట్రాల్లో కేసులు తారాస్థాయికి నమోదవుతున్నాయన్నారు. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే జూన్ 3వ తేదీనాడు కేసులు 3000 సంఖ్యను దాటాయి. అప్పటినుండి కేసుల్లో 1637 శాతంగా ఉందని అన్నారు. తెలంగాణాలో ఇంకా కూడా టెస్టింగ్ రేటు తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇదే సమయంలో కేసులు పీక్ ని రీచ్ అవుతాయని, ఆ తరువాత తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. 

కొన్ని రోజుల కిందనే కరోనా ను దాదాపుగా జయించిన కేరళ, మరోసారి వలస కూలీలా రాకతో కేసులు పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీర్తించిన కేరళ రాష్ట్రంలో కేసులు నమోదవుతుండటం.... కరోనా ఇంకా వదిలి వెళ్లిపోలేదనే విషయాన్ని గ్రహించాలని తెలిపారు. 

ఇక ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పీక్ మరికాస్త ఆలస్యం అవుతుందని. అక్కడ కేసులు పెరగడం మొదలయింది ప్రభుత్వం రైళ్లు నడపడం ప్రారంభించిన తరువాతే అని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల్లో సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మధ్య భాగం నాటికి పీక్ చేరుకోవచ్చని ఆయన తెలిపారు. 

click me!