కరోనా దారుణం : నాన్నను మీరే తగలబెట్టండి.. ఆస్తి డాక్యుమెంట్లు నాకు పంపండి !

By AN TeluguFirst Published May 24, 2021, 4:58 PM IST
Highlights

కరోనా మానవత్వాన్ని మంట గలుపుతోంది. కారుణ్యం అనే మాటకు అర్థాన్ని తుడిపేస్తోంది. అనుబంధాలకు అంతిమ గీతం పాడుతోంది. సొంత కుటుంబ సభ్యులు చనిపోతే కనీసం చావుకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చింది.

కరోనా మానవత్వాన్ని మంట గలుపుతోంది. కారుణ్యం అనే మాటకు అర్థాన్ని తుడిపేస్తోంది. అనుబంధాలకు అంతిమ గీతం పాడుతోంది. సొంత కుటుంబ సభ్యులు చనిపోతే కనీసం చావుకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితికి దిగజార్చింది.

ఆత్మీయుల చివరి చూపుకు కూడా నోచుకోలేక.. ఆ దు:ఖాన్ని దిగమింగుకోలేక అనేకమంది మానసికక్షోభ అనుభవిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తండ్రి కరోనాతో చనిపోతే.. ఓ కొడుకు అమానుషంగా ప్రవర్తించాడు

తండ్రి చనిపోయాడని సమాచారం ఇచ్చిన వారికి.. అతని మృతదేహాన్ని మీరే తగలబెట్టుకోండి.. కాకపోతే అతని దగ్గరున్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా అసహ్యంగా మాట్లాడాడు. 

ఈ ఘటన కర్నాటక లోని మైసూరు, హెబ్బాళలో జరిగింది. అక్కడి స్థానిక సూర్య బేకరి వద్దనున్న ఓ ఇంట్లో ఓ వృద్ధుడు కరోనాతో మరణించాడు. ఆ వృద్ధుడి కొడుకు కువెంపు నగర శాంతి సాగర్ కాంప్లెక్స్ దగ్గర్లో నివసిస్తున్నాడు. 

తండ్రి మృతి సంగతి తెలిసిన కొడుకు.. స్థానిక కార్పొరేటర్‌ కేవీ శ్రీధర్‌కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేయాలని, కాకపోతే అతని దగ్గరున్న రూ. 6 లక్షల డబ్బు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని పరుషంగా మాట్లాడాడు. 

ఆ విధానానికి కార్పొరేటర్ షాక్ అయ్యాడు. తరువాత మున్సిపాలిటీ సిబ్బందితో తానే దగ్గరుండి అంత్యక్రియలు పూర్తిచేయించాడు. కొడుకు నిర్వాకం గురించి స్థానికంగా అందరూ మండి పడుతున్నారు. 

click me!