
న్యూఢిల్లీ: విమానంలో పెళ్లి చేసుకొన్న ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో కోవిడ్ నిబంధనలను పాటించలేదని సీరియస్ అయింది. ఈ విషయమై విచారణకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన రాకేష్, దక్షిణ జంట ఓ ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకొని విమానంలోనే పెళ్లి చేసుకొన్నారు.ఈ విమానంలో 161 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వరుడు రాకేష్, వధువు దక్షిణ మెడలో తాళి కట్టాడు. బెంగుళూరు నుండి మధురైకి విమానంలో ఇరు కుటుంబాలు బయలుదేరారు.రాకేష్, దక్షిణ పేరేంట్స్ వ్యాపారులు. లాక్‌డౌన్ కారణంగా తమ పిల్లల పెళ్లిని విమానంలో చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. విమానంలో ప్రయాణించిన వారికి ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
also read:కరోనా లాక్ డౌన్ మహిమ... విమానంలోనే పెళ్లి.. వీడియో వైరల్
విమాన సిబ్బంది కరోనా నిబంధనలను పాటించలేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.విమానప్రయాణీకులకు డీజీసీఏ ఇప్పటికే మార్గదర్శకాలను ప్రకటించింది. అయితే ఈ గైడ్‌లైన్స్ పెళ్లి సందర్భంగా పాటించకపోవడంపై డీజీసీఏ ఆగ్రహంతో ఉంది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణకు ఆదేశించింది. విమానంలో ప్రయాణించే ప్రయాణీకులు మాస్క్ ధరించకపోతే వారిని విమానం నుండి దింపవచ్చు.విమానంలో పెళ్లి ఘటనపై విమానాశ్రాయ అథారిటీ నుండి పూర్తి నివేదికను డీజీసీఏ కోరింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.