తల్లి మరణం...బతికివస్తుందని శవంతో ఏడు నెలలుగా కొడుకు తాంత్రిక పూజలు

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 1:59 PM IST
Highlights

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నా.. రోదసిలోకి అడుగుపెడుతున్నా ఇంకా మనిషిని మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. చనిపోయిన తల్లిని తిరిగి బతికిస్తానని చెప్పి ఆమె శవంతో ఓ కుమారుడు తాంత్రిక పూజలు చేస్తున్నాడు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నా.. రోదసిలోకి అడుగుపెడుతున్నా ఇంకా మనిషిని మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి. చనిపోయిన తల్లిని తిరిగి బతికిస్తానని చెప్పి ఆమె శవంతో ఓ కుమారుడు తాంత్రిక పూజలు చేస్తున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని విశ్వంపూర్ గ్రామానికి చెందిన శోభ్‌నాథ్ గోండ్, కాలేశ్వరీ దంపతులకు అరికన్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యానికి గురైన కాలేశ్వరీ చనిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కుమారుడు తన తల్లిని తిరిగి బతికిస్తానంటూ తండ్రిని ఒప్పించాడు.

ఇందుకు తండ్రి అంగీకారం తెలపడంతో .. తల్లి మృతదేహన్ని ఇంట్లోనే ఉంచుకుని గత ఏడు నెలల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నాడు. అమ్మ నాతో మాట్లాడుతోందని తండ్రితో చెప్పేవాడు.

ఈ క్రమంలో వీరి ఇంటికి ఒక బంధువు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ తతంగాన్నంతా సదరు బంధువు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరికన్ సింగ్‌ని, అతని తండ్రి శోభ్‌నాథ్‌ని అదుపులోకి తీసుకుని.. మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Last Updated 9, Sep 2018, 1:59 PM IST