వాట్సాప్ షాక్: మండపంలో వధువు వెయిటింగ్: ట్విస్టిచ్చిన వరుడు

By narsimha lodeFirst Published 9, Sep 2018, 12:51 PM IST
Highlights

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత  వాటి వినియోగం  రోజు రోజుకు పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్  కారణంగానే ఓ పెళ్లిని రద్దు చేసుకొన్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 


లక్నో:స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత  వాటి వినియోగం  రోజు రోజుకు పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్  కారణంగానే ఓ పెళ్లిని రద్దు చేసుకొన్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాకు చెందిన ఓ యువతికి  పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కుమారుడి కోసం మండపంలో ఆమె ఎదురుచూస్తోంది. పెళ్లి కోసం వచ్చే అతిథుల కోసం వధువు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు,.

ఈ సమయంలోనే వరుడి కుటుంబసభ్యులు వచ్చి  పెళ్లి రద్దు చేసుకొంటున్నట్టు ప్రకటించారు.  వధువు నిత్యం గంటల తరబడి వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ  బిజీగా ఉండడమే కారణంగా  చెప్పారు. 

దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పోలీసుల ఫిర్యాదు చేసుకొన్నారు.  రూ. 64 లక్షలను వరుడి కుటుంబం డిమాండ్ చేస్తున్నారని.. ఈ డబ్బులు ఇవ్వనందుకే  వాట్సాప్ ను వ్యసనంగా వధువు మార్చుకొందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వధువు కుటుంబసభ్యులు మండిపడ్డారు.

Last Updated 9, Sep 2018, 12:51 PM IST