దేశంలోకి అంతుచిక్కని కొత్త వైరస్.. ఇప్పటి వరకు 15 మంది మృతి

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 12:07 PM IST
Highlights

దేశంలోకి  మరో కొత్త వైరస్ ప్రవేశించింది. మహారాష్ట్రలో జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లతో బాధపడుతూ జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 

దేశంలోకి  మరో కొత్త వైరస్ ప్రవేశించింది. మహారాష్ట్రలో జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లతో బాధపడుతూ జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఓ రకం కీటకం కుట్టడం కారణంగా ఓరియెన్షియా షుషుగమసి అనే బ్యాక్టీరియా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది.. దీనిని స్క్రబ్ టైఫస్ జ్వరంగా వైద్యులు పిలుస్తున్నారు.

దీని కారణంగా ఇప్పటి వరకు 15 మంది మరణించగా.. 75 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరిని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డెంగీని పోలిన ఈ జ్వరాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.

Last Updated 9, Sep 2018, 12:07 PM IST