పాము కాటుతో కొడుకు మృతి.. బతికొస్తాడని 30 గంటలు పూజలు..

By SumaBala BukkaFirst Published Jul 26, 2022, 8:32 AM IST
Highlights

చనిపోయిన కొడుకు  బతుకుతాడన్న ఆశలో ఓ తల్లిదండ్రులు 30 రోజుల పాటు పూజలు చేశారు. కానీ ఎంత సేపటికి చలనం లేకపోవడంతో చివరికి అంత్యక్రియలు చేశారు. 

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది.  మరణించిన కొడుకు బతుకుతాడన్న ఆశతో ఓ కుటుంబం 30 గంటల పాటు పూజలు చేసింది. మెయిన్ పురి జిల్లా జూటవాన్ మొహల్లా గ్రామానికి చెందిన తాలీబ్ ను శుక్రవారం పాము కాటు వేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే,  అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ, కుటుంబ సభ్యులు,గ్రామస్తులు అది నమ్మలేదు. 
 
అతడిని బతికించుకోవాలనే ఉద్దేశం తాంత్రికులను, పాములు పట్టే వారిని తీసుకొచ్చారు. సుమారు 30 గంటల పాటు పూజలు చేశారు. తాలీబ్ ను కాటేసిన పాముని పట్టుకునేందుకు నలుగురిని రప్పించారు. యువకుడి మృతదేహం వద్ద వేప, అరటి కొమ్మలను పెట్టి పూజలు చేశారు. ఎంత శ్రమించినా..తాలీబ్ లో చలనం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. 

అభినవ శ్రవణ కుమారుడు.. అమ్మానాన్నలను భుజాల మీద మోస్తూ వందల కి.మీ. యాత్ర.. వారి కోరిక కాదనలేకే...

ఇదిలా ఉండగా, 2019లో ఇలాంటి ఘటన నెల్లూరులో జరిగింది. చనిపోయిన వ్యక్తి బతికొస్తాడని నమ్మి.. ఓ కుటుంబం 37 రోజులు స్మశానంలోనే నివాసం ఉంది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారంఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలం, పెట్లూరు గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి డెంగ్యూతో మరణించాడు. శ్రీనివాస్ టాక్సీ డ్రైవర్ గా పనిచేసేవాడు. 

చనిపోవడానికి ముందు శ్రీనివాస్ కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు చెందిన ఓ వ్యక్తితో ఘర్షణకు దిగాడు. ఆ తరువాత మరణించాడు. దీంతో గొడవకు దిగిన వ్యక్తే  చేతబడి చేయించాడని.. అందువల్లే శ్రీనివాస్ మృతి చెందాడని కుటుంబసభ్యులు బాగా నమ్మారు. దీంతో అతడిని తిరిగి బతికించుకునేందుకు శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఓ మంత్రగాడిని కలిశారు. అతను వీరికి హామీ ఇచ్చాడు. 41 రోజుల తర్వాత శ్రీనివాస్ ను బతికిస్తానంటూ చెప్పాడు. దీనికోసం క్షుదపూజలు చేయాలని శ్రీనివాస్ కుటుంబంతో రూ.8 లక్షలు డీల్ చేసుకున్నాడు మంత్రగాడు.

త‌మిళ‌నాడులో ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. హాస్ట‌ల్ రూమ్ లో విగ‌తజీవిగా క‌నిపించిన బాలిక‌

ఇందులో భాగంగానే శ్రీనివాస్ ను పూడ్చి పెట్టిన రోజు నుండి 41 రోజులపాటు కుటుంబసభ్యులంతా స్మశానంలోనే నివాసం ఉండాలని చెప్పాడు. శ్రీనివాస్ కుటుంబసభ్యులు మంత్రగాడు చెప్పినట్టుగానే స్మశానంలోనే 37 రోజులుగా నివాసం ఉన్నారు. ఒకటిరెండు రోజుల్లోనే విషయం గ్రామమంతా పాకడంతో వీరిని స్మశానం నుంచి బైటికి పంపడానికి స్థానికులు ప్రయత్నించారు. దీన్నిఅడ్డుకొన్న శ్రీనివాస్ కుటుంబసభ్యులు కత్తులు, ఇతర మారణాయుధాలతో బెదిరిస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అలా, పెట్లూరు స్మశానంలో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పోలీసు కౌన్సిలింగ్ తరువాత కుటుంబసభ్యులు ఇంటికి తిరి వెళ్లారు. క్షుద్రపూజలు చేసి బతికిస్తానని చెప్పిన మంత్రగాడికి శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఇప్పటికే సుమారు రూ.7 లక్షలు చెల్లించారు.

click me!