వ్యాక్సిన్ వేయించుకుంటే.. మీ డిపాజిట్‌లపై అధిక వడ్డీ, బ్యాంకుల బంపరాఫర్

By Siva KodatiFirst Published Jun 8, 2021, 6:03 PM IST
Highlights

కరోనాను కట్టడి చేయాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం సైతం వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. జనవరి 16 నుంచి మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నాటి  నుంచి విడతల వారిగా వయసును బట్టి ప్రాథాన్యత క్రమంలో టీకా పంపిణీ జరుగుతోంది

కరోనాను కట్టడి చేయాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం సైతం వ్యాక్సినేషన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. జనవరి 16 నుంచి మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. నాటి  నుంచి విడతల వారిగా వయసును బట్టి ప్రాథాన్యత క్రమంలో టీకా పంపిణీ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

అయితే పలువురు మాత్రం లేనిపోని భయాలతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో టీకాల పంపిణీ ప్రోత్సహించేందుకు పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు బహుమతులు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు సైతం వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తూ వినూత్న ఆఫర్లను తీసుకొస్తున్నాయి. తాజాగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. 

Also Read:కరోనా ఉచిత వ్యాక్సినేషన్: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ వేసుకున్నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ప్రస్తుత వడ్డీరేటుపై 30 బేసిస్‌ పాయింట్లు లేదా 0.30 శాతం అదనంగా వడ్డీ ఇస్తామని యూకో బ్యాంక్‌ ప్రకటించింది. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కాల వ్యవధి 999 రోజులు మాత్రమే. సెప్టెంబర్‌ 30 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రోత్సహించడం కోసం ‘యూకో వ్యాక్సి-999’ పేరుతో ఈ ఆఫర్‌ తీసుకొచ్చామని యూకో బ్యాంక్‌ అధికారులు తెలిపారు.   

అటు మరో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఏప్రిల్‌ నెలలోనే వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. ‘‘ ఇమ్యూన్‌ ఇండియా డిపాజిట్‌ స్కీమ్‌’’ ద్వారా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికి ప్రస్తుత వడ్డీరేటుపై అదనంగా 25 బేసిస్‌ పాయింట్లతో వడ్డీ చెల్లించనుంది. అయితే, ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కాల వ్యవధి 1,111 రోజులు. వ్యాక్సిన్‌ వేసుకున్న సీనియర్‌ సిటిజన్లకైతే అదనంగా మరో 25 బేసిస్‌ పాయింట్లు కలిపి మొత్తం 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.50శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించింది.

click me!