థర్డ్‌వేవ్: పిల్లలపై ప్రభావం.. ఎయిమ్స్ చీఫ్ గులేరియా సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 8, 2021, 5:18 PM IST
Highlights

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా. కరోనా మూడో వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తుందన్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా. కరోనా మూడో వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తుందన్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్ వేవ్‌లో కూడా పిల్లల్లో కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా వున్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు. 

అటు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని పాల్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేకంగా పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపే వేవ్ ఉంటుంద‌న్న‌ దానిపై ఇప్పటివరకూ స్ప‌ష్ట‌త లేదన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా అందరిపై ఒకే ర‌క‌మైన ప్ర‌భావం చూపిందని వీకే పాల్ వెల్లడించారు.

Also Read:కరోనా ఉచిత వ్యాక్సినేషన్: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన సెరోప్రివ‌లెన్స్ డేటా ఇదే స్ప‌ష్టం చేస్తోందన్నారు. వ్య‌క్తుల బ్ల‌డ్ సీరంలో ఉండే వ్యాధి కార‌కాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివ‌లెన్స్‌. ఇది పెద్ద‌లు, పిల్ల‌ల్లో ఒకేలా ఉన్న‌ట్లు వీకే పాల్ పేర్కొన్నారు. త‌ల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే చాలు దాని వ‌ల్ల పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. ఇంట్లోని పెద్ద‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ పిల్ల‌ల వ‌ర‌కూ రావ‌డం అంత తేలిక కాద‌ని పాల్ అభిప్రాయపడ్డారు.

click me!