'బెంగళూరు వచ్చే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడకపోయినా, మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా బయటి వ్యక్తులు ('అవుట్ సైడర్స్')గా పరిగణిస్తారు' అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కన్నడీస్, నాన్- కన్నడీస్ అనే చర్చకు దారితీసింది.
ఓ సోషల్ మీడియాలో పోస్ట్ ఇప్పుడు బెంగళూరులో హీట్ పుట్టిస్తోంది. టెక్ క్యాపిటల్ బెంగళూరు కన్నడిగులదేనంటూ ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. దీంతో 'ఔట్ సైడర్-ఇన్ సైడర్' డిబేట్ మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ పోస్ట్ అంతటా ఆగ్రహాన్ని సృష్టించింది. చాలా మంది టెక్కీలు, పారిశ్రామికవేత్తలు, అన్ని వర్గాల ప్రజలు స్పందిస్తున్నారు.
'బెంగళూరు వచ్చే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడకపోయినా, మాట్లాడే ప్రయత్నం చేయకపోయినా బయటి వ్యక్తులు ('అవుట్ సైడర్స్')గా పరిగణిస్తారు' అంటూ మంజు అనే యూజర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇకా, 'ఇది జోక్ కాదు... బెంగళూరు కన్నడిగులదే.. ఇతర భాషలను ఇక్కడ అంగీకరించబోం' అంటూ అదే ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా, ఈ ట్వీట్‌ను షేర్ చేయాలని కూడా పిలుపునిచ్చారు.
undefined
To,
Everyone Coming to Bengaluru
You will be treated as OUTSIDERS in Bengaluru if you don't speak Kannada or make an effort to speak Kannada.
Write it down, Share it around. We ain't Joking.
BENGALURU BELONGS TO KANNADIGAS PERIOD.
ఈ పోస్ట్‌కు ఎక్స్‌లో భారీగా రెస్పాన్స్ లభించింది. చాలామంది యూజర్ అభిప్రాయాలను తప్పుబట్టగా.. కొందరు అతనితో ఏకీభవిస్తున్నారు.
ఈ పోస్టుకు స్పందించిన శ్రుష్టి శర్మ అనే టెక్కీ... 'బెంగళూరు ఇండియాలో భాగం. స్థానిక సంస్కృతిని గౌరవించడంతో పాటు అంతకంటే ఉన్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు.
శివ అనే మరో యూజర్ 'స్థానిక భాషలను గౌరవించడం ముఖ్యం... కానీ భాష ఆధారంగా ప్రజలను విభజించడం ప్రతికూలతకు ఆజ్యం పోస్తుంది. బెంగళూరు ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ సమ్మిళిత నగరంగా ఉంటుంది. భిన్నత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం తప్ప అడ్డంకులు సృష్టించకూడదు' అని రెస్పాండ్ అయ్యారు.
ఇదిలా ఉండగా, బెంగళూరులో తమ జీవితాన్ని సులభతరం చేసుకోవడం నేర్చుకోవాలని కన్నడేతరులను కొందరు స్థానికులు కోరారు. 'ఐబీఎంలో ఉన్నప్పుడు కేవలం 4 నెలలు మాత్రమే బెంగళూరులో నివసించాను. ఇంగ్లీష్- కన్నడ పాకెట్ డిక్షనరీ వెంట పెట్టుకొని కన్నడ మాట్లాడేందుకు ట్రై చేశా. నాకు కన్నడలో కొన్ని మాటలు వచ్చు. పూర్తిగా అస్సలు రాదు. కుతూహలం. గౌరవం.. అంతే వారు అడుగుతున్నారు" మరొకరు పేర్కొన్నారు.
ప్రియాంక లహ్రీ అనే ఫిట్ నెస్ కోచ్ మాట్లాడుతూ... కన్నడ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తనను ఎప్పుడూ చెడుగా చూడలేదని చెప్పారు. 'నేను 8 ఏళ్లుగా బెంగళూరులో ఉన్నాను. నాకు కన్నడ నేర్చుకోవడం చాలా కష్టమైంది. కానీ, భాషలో ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఇక్కడ నన్ను ఎప్పుడూ చెడుగా, బయటి వ్యక్తిలా చూడలేదు. మీరు ప్రొజెక్ట్ చేస్తున్న దానికంటే ప్రజలు చాలా భిన్నంగా, అంగీకరిస్తారు. మంచిగా ఉంటారు. మీరు ఇంటి నుండి బయటకు వస్తారా అని నాకు అనుమానం ఉంది. అక్కడ మంచి, పౌర కన్నడిగులు ఉన్నారు' అని లహ్రీ తన పోస్టులో రాసుకొచ్చారు.