చెన్నై విమానాశ్రయంలో బిగ్ షాక్: మహిళ లగేజీలో పాముల కుప్ప

By Rajesh Karampoori  |  First Published Apr 30, 2023, 8:59 AM IST

చెన్నై ఇంటర్ నేషల్ ఎయిర్ పోర్ట్ లో పాముల కలకలం చేలారేగింది. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికురాలి బ్యాగులో వివిధ జాతులకు చెందిన 22 పాములు లభ్యమయ్యాయి. 


చెన్నై ఇంటర్ నేషల్ ఎయిర్ పోర్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ విచిత్ర ఘటనకు ఈ విమానాశ్రయం వేదిక అయ్యింది. ఓ మహిళా ప్రయాణీకురాలి బ్యాగ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికురాలు శుక్రవారం మలేషియా నుంచి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.  ఆ వీడియో ఓ అధికారి పొడవాటి రాడ్‌ని ఉపయోగించి పామును బయటకు తీస్తున్నట్లు చూడవచ్చు. కొందరు నేలపై ఉన్న డబ్బాల నుండి బయటకు తీశారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహిళను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై చెన్నై కస్టమ్స్ అధికారులు ట్వీట్  చేస్తూ..  "28.04.23న, కౌలాలంపూర్ నుండి ఫ్లైట్ నంబర్ AK13లో వచ్చిన ఓ మహిళను కస్టమ్స్ అడ్డగించింది. ఆమె సామాను తనిఖీ చేసి చూడగా..  అందులో  22 వివిధ జాతుల పాములు,ఒక ఊసరవెల్లి కనుగొనబడ్డాయి. వాటిని  స్వాధీనం చేసుకుని.. 1962 r/w వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు ఫైల్ చేశాం" అని ట్వీట్ చేసింది.

On 28.04.23, a female pax who arrived from Kuala Lumpur by Flight No. AK13 was intercepted by Customs.
On examination of her checked-in baggage, 22 Snakes of various species and a Chameleon were found & seized under the Customs Act, 1962 r/w Wildlife Protection act, 1972 pic.twitter.com/uP5zSYyrLS

— Chennai Customs (@ChennaiCustoms)

Latest Videos


అంతకుముందు జనవరిలో ఇలాంటి సంఘటనలో జరిగింది. 45 బాల్ కొండచిలువలు, మూడు మార్మోసెట్‌లు, మూడు నక్షత్రాల తాబేళ్లు, ఎనిమిది కార్న్ స్నేక్స్ లను  చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

\

click me!