బ్యాగులో దూరిన పాము.. పుస్తకాలు తీయ్యబోతే..

First Published Jul 4, 2018, 1:17 PM IST
Highlights

బ్యాగులో దూరిన పాము.. పుస్తకాలు తీయ్యబోతే..

ఓ విద్యార్థి పుస్తకాలు తీద్దామని బ్యాగ్ జిప్ తీస్తుండగా.. బుస్ బుస్ మంటూ శబ్ధం వినిపించింది. వెంటనే పుస్తకాల మధ్యలోంచి ఓ నాగుపాము బయటకు వచ్చింది.. అంతే ఆ బాలుడి గుండె లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోసాగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కామరాజనగర్ పట్టణానికి  చెందిన ఓ విద్యార్థి స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

రోజు లాగానే నిన్న కూడా బ్యాగ్ తగిలించుకుని కిలోమీటరు దూరంలోని పాఠశాలకు నడిచి వెళ్లాడు. క్లాస్‌రూంలో స్నేహితులందరితో సరదాగా కబుర్లు చెప్పి.. టీచర్ వచ్చిన వెంటనే బ్యాగ్ ఓపెన్ చేశాడు.. అంతే బుస్ బుస్ మంటూ ఓ పాము పుస్తకాల మధ్య నుంచి బయటకు వచ్చింది.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలుడు బ్యాగ్‌ను బయటపడేశాడు... పామును చూసి విద్యార్థులంతా కంగారుపడ్డారు.

రోజూ పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే తన బ్యాగును ఓ మూలన పడేసే బాలుడు అసలు తెరవకుండానే.. తర్వాతి రోజు పాఠశాలకు తీసుకుని వచ్చుంటాడని.. ఆ సమయంలోనే పాము బ్యాగు లోపలికి చేరి ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. విద్యార్థి బ్యాగును తగిలించుకుని కిలోమీటరు దూరం నడిచినా పాము అతన్ని ఏం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

click me!