నిద్రపోతున్న బాలిక మెడకు చుట్టుకున్న నాగుపాము.. గంటన్నరపాటు బిక్కుబిక్కు.. చివరికి..!

Published : Sep 12, 2021, 04:24 PM IST
నిద్రపోతున్న బాలిక మెడకు చుట్టుకున్న నాగుపాము.. గంటన్నరపాటు బిక్కుబిక్కు.. చివరికి..!

సారాంశం

నిద్రపోతున్న ఏడేళ్ల బాలిక మెడకు చుట్టుకుని నాగుపాము కనీసం ఒక గంటన్నరపాటు అలాగే ఉంది. వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం చేరవేశారు. కానీ, వారు వచ్చేలోపు ఆ పాము బాలికను కాటేసి పారిపోయింది. 

ముంబయి: మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఏడేళ్ల బాలిక మెడకు నాగు పాము చుట్టుకున్న ఘటన ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నది. సేలూ తాలూకాకు చెందిన బోర్‌ఖేడీ గ్రామంలో బాలిక పద్మాకర్ గడ్కరీ ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి నిద్రపోయింది. ఆమె నిద్రలోకి జారుకున్నాక రాత్రి సుమారు 11 గంటలకు ఓ నాగుపాము అక్కడికి చేరింది. ఆమె పడుకున్న పక్కలోకి వెళ్లి ఆమె మెడకు చుట్టుకున్నది. సుమారు గంటన్నరపాటు అలాగే ఉంది. 

బాలిక మెడకు చుట్టుకుని పడగ తీసి ఆ పాము అటూ ఇటూ మెదిలింది. అదే సమయంలో బాలిక కళ్లు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అదిరిపడింది. ఉన్నపళంగా ఒంటిలోని సత్తువనంతా కట్టగట్టుకుని కేకలు వేసింది. వెంటనే పక్కనే ఉన్న తల్లిదండ్రులు ఉలిక్కిపడి నిద్రలేచారు. చిన్నారి ఒళ్లో ఉన్న నాగుపాముని చూసి వారూ కేకలు వేశారు.

ఇరుగుపొరుగు వారు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. పాము పట్టించడానికి వన్యప్రాణి సంరక్షకులకు కబురుపెట్టారు. కనీసం గంటపాటు కదలకుండా మెదలకుండా పామును చూస్తూనే బాలిక ఉన్నది. కానీ, ఆమె చిన్నగా కదలగానే పాము కాటేసింది. బాలికను కాటేసిన పాము వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. బాలికను చికిత్స కోసం సేవాగ్రామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలికకు చికిత్స అందుతున్నది.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్