
ఏసీల్లో పాములు దూరాయి అని మీరు చాలా వార్తలు వినే ఉంటారు. రిపేర్ వచ్చిందని ఏసీ సర్వీస్ చేపిస్తుంటే, దానిలో నుంచి పాము బయటకు రావడం చాలా చోట్ల జరిగింది. అయితే, ఓ చోట మాత్రం చాలా దారుణం జరిగింది. ఓ పాము ఏసీని తన నివాసంగా మార్చుకుంది. అక్కడే ఉంటుంది. మధ్యలో ఆకలివేసి, పాము బయటకు వచ్చి బయట వెళ్తున్న ఎలుకను నోటితో కరిచి పట్టుకుంది. ఇదంతా వీడియోలో రికార్డు కాగా, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ, వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీడియో చూస్తుంటేనే చాలా మందిలో భయం పుట్టుకురావడం గమనార్హం. పాము చాలా తెలివిగా వచ్చి ఎలుకను పట్టుకొని, మళ్లీ ఏసీలోకి వెళ్లిపోవడం గమనార్హం. అక్కడున్నవారు దానిని వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
వీడియోకి విపరీతంగా వ్యూస్ రావడం గమనార్హం. లైకుల వర్షం కురుస్తోంది. ఎలుకల భయంతో పామును పెంచుకుంటున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేయడం విశేషం.