విమానంలో వృత్తి ధర్మం చాటుకున్న డాక్టర్లు.. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారికి గాలిలోనే వైద్యం.. చివరికి

Published : Aug 29, 2023, 08:55 AM ISTUpdated : Aug 29, 2023, 09:25 AM IST
విమానంలో వృత్తి ధర్మం చాటుకున్న డాక్టర్లు.. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారికి గాలిలోనే వైద్యం.. చివరికి

సారాంశం

విమానంలో ప్రాయప్రాయస్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారికి... అందులో ఉన్న డాక్టర్లు ఊపిరిపోశారు. గాలిలోనే బాలికకు వైద్యం అందించారు. దీంతో ఆ పసిపాప ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. తరువాత విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. అనంతరం బాలికను హాస్పిటల్ కు తరలించారు.

వైద్యో నారాయణో హరి అనే మాటకు సరైన అర్థాన్ని ఇచ్చారు ఐదుగురు డాక్టర్లు. విమానంలో ప్రాణప్రాయస్థితిలో ఉన్న ఓ చిన్నారికి గాలిలోనే తమ నైపుణ్యంతో చికిత్స అందించారు. ఆ పసి పాప ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానంలో చోటు చేసుకుంది. 

ఇద్దరు బాలురపై ఆరుగురు క్లాస్ మేట్స్ లైంగిక దాడి.. స్కూల్ క్యాంప్ లో అఘాయిత్యం..

వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన యూకే - 814 బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అదే విమానంలో ఓ రెండేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో ప్రయాణిస్తోంది. ఆ బాలిక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి వెళ్తోంది. విమానం టేకాఫ్ అయిన తరువాత చిన్నారి పరిస్థితి మరింత విషమించింది. శ్వాస తీసుకోవడం నిలిపివేసింది. వేళ్లు, పెదాలు నీలి రంగులోకి మారిపోవడం మొదలయ్యింది. దీనిని తల్లిదండ్రులు గమనించి, ఆందోళన చెందారు.

పైలట్లకు ఈ సమాచారం చేరడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి నాగ్ పూర్ వైపు మళ్లించారు. అయితే ఓ సమ్మిట్ కు వెళ్లి విమానంలో ఢిల్లీకి వెళ్తున్న నలుగురు ఎయిమ్స్ డాక్టర్ల టీమ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే బాలిక దగ్గరికి చేరుకున్నారు. ఆ డాక్టర్ల టీమ్ కు ఢిల్లీకి చెందిన ఐఎల్‌బీఎస్‌ హాస్పిటల్ లో పని చేసే మరో డాక్టర్ తోడయ్యాడు. ఈ ఐదుగురూ కలిసి బాలికకు ప్రథమ చికిత్స అందించారు. సీపీఆర్ చేసి, శ్వాస తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించారు. దీంతో బాలిక ప్రాణప్రాయస్థితి నుంచి గట్టెక్కింది.

ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని.. కూతురును వ్యాపారవేత్తకు అమ్మేసిన తల్లి.. కుమారుడిని కూడా..

అనంతరం విమానం నాగ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఓ అంబులెన్స్ ద్వారా చిన్నారిని కిమ్స్ కింగ్స్ వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రోగి పీడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని ఎయిమ్స్ ఎక్స్ (ట్విట్టర్ ) పేజీలో పోస్టు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?