స్మృతి ఇరానీ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 7, 2024, 4:15 AM IST

smriti irani biography:  నటిగా జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2003లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి ఆమె జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చేద్దాం. 
 


Smriti Irani biography: 

స్మృతి ఇరానీ  బాల్యం, విద్య, 

Latest Videos

undefined

స్మృతి ఇరానీ 1976 మార్చి 23న  ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు అజయ్ కుమార్ మల్హోత్రా, అతను చిన్న వ్యాపారం చేస్తున్నాడు. స్మృతి ఇరానీ తల్లి బెంగాలీ కుటుంబానికి చెందిన వారు. స్మృతి ఇరానీ విద్యాభ్యాసం దేశ రాజధాని ఢిల్లీలో పూర్  చేశారు. ఆమె చిన్ననాటి నుంచే నటన , మోడలింగ్ రంగాలపై ఆసక్తి కనబరిచేంది. ఇలా ఆమె  10వ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. 

ఆ ఆసక్తితో మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొంది. ఆమె ప్రారంభ జీవితం చాలా కష్టతరమైనది. సమాజంలో ఉన్న ఆంక్షలన్నింటినీ ఛేదించి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. స్మృతి ఇరానీ 1998లో మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీని తర్వాత స్మృతి ఇరానీ మాయానగరి ముంబైలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎన్నో పోరాటాల తర్వాత మోడలింగ్, నటన, రాజకీయ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

Smriti Irani: నటన జీవితం

స్మృతి ఇరానీ మోడలింగ్‌తోపాటు  నటనా రంగంలోకి అడుగెట్టింది. స్మృతి ఇరానీ 2000 సంవత్సరంలో 'హమ్ హై కల్ ఆజ్ కల్ ఔర్ కల్' అనే టెలివిజన్ సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే.. ఆమెకు 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియల్ ద్వారా మంచి పేరు వచ్చింది.  ఎందుకంటే ఈ సీరియల్‌లో ఆమె 'తులసి' ప్రధాన పాత్రను పోషించింది. ఇప్పటి ఆమె అభిమానులు తులసిగానే సంభోదిస్తారు. ఇలా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

ఈ క్రమంలో ఆమెను ఎన్నో అవార్డులు, బహుమతులు లభించాయి. ఇందులో ఆమె అద్భుత నటనా నైపుణ్యానికి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు, ఇండియన్ టెలి అవార్డు, స్టార్ పరివార్ అవార్డులను గెలుచుకుంది. 2001లో జీ టీవీలో ప్రసారమైన రామాయణంలో సీత పాత్రను స్మృతి ఇరానీ పోషించింది. 2006లో ఆమె 'తోడి సి జమీన్ ఔర్ తోడి సా ఆస్మాన్' అనే టీవీ సీరియల్‌లో కో-డైరెక్టర్‌గా పనిచేశాడు. 2008లో సాక్షి తన్వర్‌తో కలిసి డాన్స్ ఆధారిత టీవీ సీరియల్ 'యే హై జల్వా'కి హోస్ట్‌గా వ్యవహరించాడు. ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇదిలాఉంటే.. స్మృతి ఇరానీ 2001లో జుబిన్ ఇరానీ పార్సీని వివాహం చేసుకున్నారు. వీరికి జోహార్ ఇరానీ , జోయిష్ ఇరానీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Smriti Irani: రాజకీయ జీవితం

నటన ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2003లో బీజేపీలో చేరారు.  స్మృతి ఇరానీని తొలిసారిగా మహారాష్ట్రలో బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. దీని తరువాత.. 2004లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్‌పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రాహుల్ గాంధీపై అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఇక్కడ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ.. మొక్కవొని పట్టుదలతో రాజకీయాల్లోనే ఉంది. నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలపై తనదైన శైలిలో గొంత్తెది. అధికార పార్టీలను నిలదీసేది.  ఈ తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ స్థానం నుండి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించింది.ఇలా తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. స్మృతి ఇరానీ 2011, 2017 సంవత్సరాల్లో గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

Smriti Irani: రాజకీయ ప్రయాణం

స్మృతి ఇరానీ మే 2014 నుండి జూలై 2016 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ) మంత్రిగా పనిచేశారు. దీని తరువాత ఆమె  జూలై 2017 నుండి మే 2018 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీనితో పాటు, అతను జూలై 2016 నుండి జూలై 2021 వరకు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఆమె కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి.

click me!