
కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ దారిలోనే పశ్చిమ బెంగాల్ కూడా వెళ్లనుంది. అయితే ఒకే సారి కాకుండా దశల వారీగా ఆంక్షలు విధించనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సెక్రటేరియర్ వర్గాలు వివరాలు వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఒక్కరోజులో 6 వేల NGOsల విదేశీ విరాళాలు కట్!
పశ్చిమ బెంగాల్ లో కరోనా పాజిటివిటీ రేటు చాలా తక్కువగా ఉందని ఆ రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు లేవని తెలిపారు. 17 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లోనే ట్రీట్‌మెంట్ పొందుతున్నారని చెప్పారు. మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని తెలిపారు. కేవలం 3 శాతం మందికి మాత్రమే హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం వస్తోందని ఆయన తెలిపారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొవడానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్ పై కరోనా వల్ల ఎలాంటి ఒత్తిడి లేదని అన్నారు. ఆక్సిజన్ కొరత, మెడిసిన్ కొరత లేదని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని అన్నారు. అవసరమైనప్పుడు ఆంక్షలు విధిస్తుందని తెలిపారు. ప్రస్తుతం అయితే ఎలాంటి కఠిన లాక్ డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అయితే కరోనా కేసులు పెరగకుండా, ప్రజలు గుమిగూడకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెట్రో, బస్సు సర్వీసులను ఇప్పుడే రద్దు చేయబోదని తెలిపారు. అవసరమైతే దశలవారీగా ఆంక్షలు విధిస్తుందని ఆయన చెప్పారు.
పలు ప్రభుత్వ కార్యక్రమాల రద్దు..
కోవిడ్ -19 పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకుంది. వచ్చే సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన ‘ఛత్ర సోప్తాహో’ (విద్యార్థుల వారోత్సవాలు) నిర్వహించాల్సి ఉంది. అలాగే వచ్చే వారం వివిధ జిల్లాల్లో ‘దువారే సర్కార్’, ‘దువారే రేషన్’ నిర్వహించాల్సి ఉండగా వాటిని ప్రభుత్వం నిలిపివేసింది.
బ్యాంక్ లాకర్‌లో అత్యంత విలువైన మరకత లింగం .. దాని విలువ తెలిస్తే షాక్..
పశ్చిమబెంగాల్ లో 4,512 కరోనా కేసుల నమోదు..
పశ్చిమ బెంగాల్‌లో శనివారం రోజు 4,512 కరోనా కేసుల నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. దీంతో పాటు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజా ఒమిక్రాన్ కేసుల నమోదుతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 16కి చేరింది. కొత్తగా ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలో ఒకరు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్‌లోని భారతదేశం-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరొకరు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వచ్చారు.
కొత్తగా 22,775 కేసులు..
ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,775 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వల్ల 220 మంది మరణించారని తెలిపింది. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,81,080కి చేరుకుందని పేర్కొంది.