బీజేపీలోకి ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు.. తలపట్టుకున్న నితీశ్

Siva Kodati |  
Published : Dec 25, 2020, 03:49 PM IST
బీజేపీలోకి ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు.. తలపట్టుకున్న నితీశ్

సారాంశం

జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రకటన చేశారు. 2019లో జరిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది.

అయితే గతకొంత కాలంగా బీజేపీ- జేడీయూ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఏకైక సభ్యుడు గల పీపుల్స్‌ పార్టీ ఆఫ్ ఆరుణాచల్‌ ప్రదేశ్‌ ఎమ్మెల్యే కూడా కషాయ కండువా కప్పుకున్నారు. మొత్తం 60 మంది సభ్యులు గల అరుణాచల్‌ ప్రదేశ్ శాసనసభలో జేడీయూ ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలం 48కి చేరింది.

సభలో ప్రస్తుతం కాంగ్రెస్ నలుగురు, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీక నలుగురు సభ్యులను కలిగివున్నారు. కాగా ఇటీవల ముగిసిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో నితీష్‌ కుమార్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌‌లో మాత్రం బిహార్‌ జేడీయూ నేతలు బీజేపీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులను బీజేపీ మభ్యపెట్టిందని ఆరోపిస్తున్నారు. దీనిపై నితీష్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu