నెలసరి దాచిపెట్టి పెళ్లి.. నమ్మకాన్ని వమ్ముచేసిందని కోర్టుకెక్కిన భర్త...

Published : Dec 25, 2020, 03:21 PM IST
నెలసరి దాచిపెట్టి పెళ్లి.. నమ్మకాన్ని వమ్ముచేసిందని కోర్టుకెక్కిన భర్త...

సారాంశం

పెళ్లి సమయంలో పీరియడ్స్ ఉన్న విషయం చెప్పకుండా దాచి పెట్టిందని ఓ భర్త భార్యకు విడాకులు ఇవ్వడం కోసం కోర్టుకెక్కాడు. ఈ విచిత్రమైన సంఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. తన దగ్గర నెలసరి విషయాన్ని దాచిపెట్టిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడో భర్త. అలాగే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 

ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళకు నెలసరి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. తీరా పెళ్లయ్యాక గుడికి వెళ్తుంటే తను లోపలకు రాలేనని అసలు విషయాన్ని చెప్పింది. 
అలా వాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఈ విషయంలో ఆమె మీద నమ్మకం పోయిందని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

దీంతోపాటు ఇంట్లోవాళ్లకు పైసా కూడా ఇవ్వొద్దని పోరు పెట్టేదన్నాడు. కేవలం ఆమె చేతి ఖర్చుల కోసమే ప్రతి నెలా రూ.5 వేలు ఇవ్వాలని, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలని హింసించేదని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్‌లో వివరించాడు. 

చాలాసార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్లి సతాయించేందని వాపోయాడు. తను అడిగినవి చేయకపోతే.. నీచంగా బెదిరించేదన్నాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్‌ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని, ఇలాంటి భార్యతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు.

PREV
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu