భార్య రాలేదనే కోపంతో బావమరిది ఇంటికి నిప్పు: ఆరుగురు సజీవ దహనం

Published : Apr 04, 2021, 10:31 AM IST
భార్య రాలేదనే కోపంతో బావమరిది ఇంటికి నిప్పు: ఆరుగురు సజీవ దహనం

సారాంశం

ఓ వ్యక్తి పైశాచికంగా వ్యవహరించడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో చోటు చేసుకొంది.  భార్య తన ఇంటికి రానని తెగేసి చెప్పడంతో ఓ తాగుబోతు భార్య సోదరుడు ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఆరుగురు మరణించారు.

బెంగుళూరు: ఓ వ్యక్తి పైశాచికంగా వ్యవహరించడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో చోటు చేసుకొంది.  భార్య తన ఇంటికి రానని తెగేసి చెప్పడంతో ఓ తాగుబోతు భార్య సోదరుడు ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఆరుగురు మరణించారు.

కొడగు జిల్లా కనూరులో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు ప్రకటించారు. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తికి బేబీతో వివాహమైంది. బోజ మద్యానికి బానిసగా మారాడు.  భార్యను పిల్లలను వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు భరించలేక  బేబీ సోదరుడి ఇంటికి వచ్చింది.  

ఈ నెల 2వ తేదీన  బోజ తన భార్య ఉన్న ఇంటికి వచ్చాడు. భార్యతో తీవ్రంగా గొడవపడ్డారు. తనతో ఇంటికి రావాలని కోరాడు. ఆమె ససేమిరా అని చెప్పింది. తనను ఇంటికి రావడానికి నిరాకరించిన భార్యపై కక్ష పెంచుకొన్నాడు.  అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయిన బోజ అర్ధరాత్రి అదే ఇంటికి చేరుకొన్నాడు.తనతో పాటు పెట్రోల్ కూడా తెచ్చుకొన్నాడు.

బేబీతో పాటు ఆమె పిల్లలు , సోదరుడు మంజు ఆయన కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి పూట అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన బోజ ఇంటి బయట నుండి తలుపులకు తాశం వేశారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

దీంతో ఇంటికి మంటలు అంటుకొన్నాయి. నిద్రలోనే బోజ భార్య బేబీ, సీత, ప్రార్ధన లు సజీవదహనమయ్యారు. ఈ మంటల్లో విశ్వాస్, ప్రకాశ్, విశ్వాస్, , భాగ్య, పాచెలు తీవ్రంగా గాయపడ్డారు. మంటలను గుర్తించిన స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు.ఫైరింజన్ వచ్చేసరికి  ముగ్గురు మంటల్లో సజీవదహనమయ్యారరు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వాస్, ప్రకాశ్, విశ్వాస్ లు మరణించారు. భాగ్య, పాచెలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result