సినిమాల్లో స్టార్ అవ్వాల్సిన నటుడు.. చైన్ స్నాచర్‌‌గా అవతారం, ఒంటరి మహిళలే టార్గెట్

Siva Kodati |  
Published : Apr 03, 2021, 07:12 PM IST
సినిమాల్లో స్టార్ అవ్వాల్సిన నటుడు.. చైన్ స్నాచర్‌‌గా అవతారం, ఒంటరి మహిళలే టార్గెట్

సారాంశం

సినిమాల్లో నటించి పెద్ద స్టార్ అవ్వాల్సిన ఓ నటుడు.. చెడు అలవాట్ల కారణంగా చైన్ స్నాచర్‌గా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా‌ చేసుకుని అతను చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు.

సినిమాల్లో నటించి పెద్ద స్టార్ అవ్వాల్సిన ఓ నటుడు.. చెడు అలవాట్ల కారణంగా చైన్ స్నాచర్‌గా మారి చివరికి కటకటాల పాలయ్యాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా‌ చేసుకుని అతను చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిత్రం సూరత్‌లో రోడ్డుపై వెళ్తోన్న మహిళ మెడలో నుంచి చైన్‌ లాక్కుని పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. అరెస్ట్‌ అయిన ఇద్దరిలో ఒకరిని బాలీవుడ్‌ టీవీ సీరియల్‌ నటుడు మీరజ్‌ కపాడి కాగా మరొకరిని బిల్లర్‌ వైభవ్‌ జాదవ్‌గా గుర్తించారు. 

మీరజ్‌ కపాడి ఇప్పటికే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. అంతే కాదు తన స్నేహితులకు సీరియల్స్‌లో సైతం అవకాశం ఇప్పించాడు. అయితే ఇతడికి క్రికెట్‌ బెట్టింగ్‌ అంటే పిచ్చి.

దాంతో సంపాదన సంగతి పక్కనబెడితే.. లక్షలాది రూపాయల డబ్బు పొగొట్టుకోవడమే కాక అప్పుల పాలయ్యాడు. ఇదే సమయంలో మీరజ్‌కు బిల్లర్‌ వైభవ్‌ జాదవ్‌ పరిచయమయ్యాడు.

అతడు కూడా బెట్టింగ్‌ వల్ల అప్పుల పాలైన బాపతు కావడతో ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవారు.

అయితే నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు పెరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు మోరా భాగల్ వద్ద బైక్‌పై వెళుతున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి మూడు గొలుసులతో పాటు 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు వైభవ్‌పై ఇప్పటికే 12 కేసులు నమోదైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

రాజ్‌కోట్, కేశోడ్, జునాగఢ్‌, అహ్మదాబాద్‌లతో సహా వెరవాల్‌ ప్రాంతాల్లో ఇతడిపై కేసులు వున్నాయి. చైన్ స్నాచింగ్‌లతో పాటు వీరిద్దరూ వీధుల్లో పార్క్‌ చేసిన కార్లను కూడా దొంగిలించినట్లుగా తేల్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu