ఎఎఫ్ టీసీ ట్రైనీ క్యాడెట్ మృతి.. ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై హత్య కేసు..

Published : Sep 26, 2022, 06:37 AM ISTUpdated : Sep 26, 2022, 06:38 AM IST
ఎఎఫ్ టీసీ ట్రైనీ క్యాడెట్ మృతి.. ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై హత్య కేసు..

సారాంశం

ఓ ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య కేసులో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై హత్యకేసు నమోదయ్యింది. 

బెంగళూరు : భారత వాయుసేనకు చెందిన ఓ ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై హత్యకేసు నమోదయ్యింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ(AFTC)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఎఫ్ టీసీ క్యాంపస్లోని ఓ గదిలో అంకిత్ ఝా (27) అనే ట్రైనీ క్యాడెట్ ఇటీవల ఉరేసుకుని కనిపించాడు. అతనిపై అప్పటికే కోర్టు విచారణ కొనసాగుతోందని దీంతో శిక్షణ నుంచి తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే  నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  

మృతుడి సోదరుడి ఫిర్యాదు  మేరకు శనివారం స్థానిక ఠాణాలో ఆరుగురు ఎయిర్ఫోర్స్ అధికారులపై ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఏఎఫ్ టీసీ అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మృతుడి సోదరుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. తన సోదరుడికి కాలేజీ క్యాంపస్ లో నిత్యం వేధింపులు, చిత్రహింసలు ఎదురయ్యాయని ఆరోపించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. ‘ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఓ వార్తా సంస్థకు తెలిపారు. నిందితులను అరెస్టు చేయలేదని చెప్పారు. కేసు విచారణలో అన్ని విధాలుగా సహకరిస్తామని  వాయుసేన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. 

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డ్డ టెంపో,, ఏడుగురు పర్యాటకుల దుర్మ‌ర‌ణం

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM