ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డ్డ టెంపో,,  ఏడుగురు పర్యాటకుల దుర్మ‌ర‌ణం 

By Rajesh KarampooriFirst Published Sep 26, 2022, 4:50 AM IST
Highlights

హిమచ‌ల్ ప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కులు జిల్లాలోని ఘియాగిలో హైవే-305పై జలోడా సమీపంలో ఆదివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుత‌ప్పి లోయలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పర్యాటకులు మరణించగా, 10 మందికి తీవ్ర గాయపడ్డారు. 

హిమచ‌ల్ ప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కులు జిల్లాలోని ఘియాగిలో హైవే-305పై జలోడా సమీపంలో ఆదివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుత‌ప్పి లోయలో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పర్యాటకులు మరణించగా, 10 మందికి తీవ్ర గాయపడ్డారు. అర్థ‌రాత్రి వ‌ర‌కు సహాయక చర్యలు జ‌రిగాయి.  మృతుల్లో ఐదుగురు యువకులు, ఇద్దరు మ‌హిళలు ఉన్నారు. కులు జిల్లాలోని ఘియాగిలో హైవే-305పై జలోడా సమీపంలో ఆదివారం రాత్రి ఓ టెంపో ట్రావెలర్ అదుపుత‌ప్పి లోయలో పడిపోయింది.

ఘ‌ట‌న స్థ‌లంలో అర్థ‌రాత్రి వ‌ర‌కు సహాయక చర్యలు జ‌రిగాయి.  మృతుల్లో ఐదుగురు యువకులు, ఇద్దరు బాలికలు ఉన్నట్టు స‌మాచారం. ప్రయాణికుల్లో ముగ్గురు ఐఐటీ వారణాసి విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. మరికొందరు వివిధ రంగాలకు చెందిన వారు. ప్ర‌మాద స‌మాచారం తెలియ‌గానే..  సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగ‌మే ప్ర‌మాదానిక కార‌ణ‌మ‌ని ఎస్ఎస్పీ కులు గురుదేవ్ శర్మ తెలిపారు.  జలోడా సమీపంలోకి రాగానే అదుపుతప్పి హైవేకి 400 మీటర్ల దిగువన ఉన్న లోయలో పడిపోయింది.  ప్ర‌మాద సమ‌యంలో  16 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 11 మందిని బంజార్ ఆసుపత్రిలో చేర్చారు.

క్షతగాత్రులను రక్షించేందుకు పోలీసులు, హోంగార్డు సిబ్బంది, స్థానికులు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిలో కొందరు ఉద్యోగస్తులు కాగా మరికొందరు విద్యార్థులు. వీరంతా ఢిల్లీ నుంచి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా సందర్శించేందుకు వచ్చారు. వాతావరణం అనుకూలించక పోవడంతో క్షతగాత్రులను రక్షించడం కష్టంగా మారింది. బంజర్ ఎమ్మెల్యే సురేంద్ర శౌరీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రజల నుంచి కూడా ఆయన సహాయం కోరారు. కానీ వాతావరణం సరిగా లేకపోవడం, చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. 

రెస్క్యూ ఆపరేషన్‌కు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. రహదారికి 400 మీటర్ల దిగువన లోయలో పడిన వాహనం నుండి గాయపడిన వారిని రక్షించి అటవీ మరియు కొండచరియలు విరిగిపడే రహదారి గుండా రహదారిపైకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజర్ ఎమ్మెల్యే సురేంద్ర శౌరీ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రజల నుంచి కూడా ఆయన సహాయం కోరారు.
 

click me!