సిత్రాంగ్ తుఫాను బీభ‌త్సం.. ఈశాన్యంలో దెబ్బ‌తిన్న ఇండ్లు.. నేల‌కూలిన చెట్లు

Published : Oct 26, 2022, 10:10 AM IST
సిత్రాంగ్ తుఫాను బీభ‌త్సం.. ఈశాన్యంలో దెబ్బ‌తిన్న ఇండ్లు.. నేల‌కూలిన చెట్లు

సారాంశం

Cyclone Sitrang: సిత్రాంగ్ తుఫాను బీభ‌త్సం కొన‌సాగుతోంది. ఈశాన్య భార‌తంలోని చాలా రాష్ట్రాలు సోమవారం నుండి భారీ నుండి అతి భారీ వర్షపాతాన్ని చూస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త వాతావ‌ర‌ణ శాఖ మ‌రోసారి ఆయా ప్రాంతాల‌ను హెచ్చ‌రిస్తూ.. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  

Heavy Rain: ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షపాతం కలిగించిన సిత్రాంగ్ తుఫాను మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ప్రాంతంలోని చాలా రాష్ట్రాల్లో సోమవారం నుండి భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త వాతావ‌ర‌ణ శాఖ మ‌రోసారి ఆయా ప్రాంతాల‌ను హెచ్చ‌రిస్తూ.. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. "సిత్రాంగ్ తుఫాను మంగళవారం ఉదయం 5:30 గంటలకు అల్పపీడనంగా బలహీనపడింది. బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడింది. ఉదయం 8:30 గంటలకు ఈశాన్య బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న మేఘాలయలో కేంద్రీకృతమై ఉంది" అని ఐఎండీ గౌహతి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

“ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది... దీని ప్రభావంతో విస్తారమైన వర్షపాతం, వివిక్త ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వచ్చే 24 గంట‌లు ఈశాన్య రాష్ట్రాలు భారీ వ‌ర్షాలు చూస్తాయి” అని ఐఎండీ పేర్కొంది. రానున్న 12 గంటల్లో మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపురలలో గంటకు 25-35 కిలో మీట‌ర్ల వేగంతో, కొన్ని చోట్ల 45 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు న‌మోద‌వుతాయ‌ని పేర్కొంది.  ఆ తర్వాత రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం ఇద్దరు మహిళలు వాగు దాటుతుండగా గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో మహిళలు తమ వరి పొలాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చింగై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోయి గ్రామం వద్ద చల్లౌ నది సమీపంలోని తొలిరు వాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తప్పిపోయిన ఇద్దరు మహిళలను ఆర్‌ఎస్ వారేచుంగ్ భార్య ఆర్‌ఎస్ న్గమ్రేలా (30), పోయి గ్రామానికి చెందిన ఆర్‌కె రాంరేలా (34) ఆర్‌కె మాతోత్మిగా గుర్తించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందంతో పాటు రాష్ట్ర పోలీసు బృందాన్ని పంపారు. బీరేన్ సింగ్ కూడా గ్రామస్తులతో ఫోన్‌లో మాట్లాడి ప్ర‌స్తుత వివ‌రాలు అప్‌డేట్ చేయాలని కోరారు. సిత్రాంగ్ తుఫాను కార‌ణంగా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదైంది.

ఇక్కడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో మంగళవారం దీపావళి ఉత్సవాలు మాత్రమే కాకుండా, అక్టోబర్ 27న జరుపుకునే రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ అయిన నింగోల్ చకౌబా కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం నుండి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల్లో త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో 509 ఇళ్లు దెబ్బతిన్నాయి, ఒకరు గాయపడ్డారు. దక్షిణ త్రిపుర జిల్లాలో తుఫాను కారణంగా 24 గ్రామాలు, 781 హెక్టార్ల పంట నష్టం జరగడంతో 3,700 మంది ప్రభావితమయ్యారు. మిజోరంలో, ఐజ్వాల్, లుంగ్లీ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయబడ్డాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమ, మంగళ, బుధవారాల్లో ప్రజలు నదుల్లోకి వెళ్లవద్దని ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పాలనాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu