మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ: సిట్ బృందం సోదాలు

Published : Mar 14, 2021, 10:49 AM ISTUpdated : Mar 14, 2021, 11:32 AM IST
మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ: సిట్ బృందం సోదాలు

సారాంశం

బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి రాసలీలల వీడియోల కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీడీని ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనేది సిట్‌ తేల్చనుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో  పోలీసులు సోదాలు నిర్వహించారు. 

బెంగుళూరు:  బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి రాసలీలల వీడియోల కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీడీని ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనేది సిట్‌ తేల్చనుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో  పోలీసులు సోదాలు నిర్వహించారు. 

బెంగళూరు రూరల్‌లోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్‌లో నివాసం ఉంటున్న సురేష్‌ శ్రవణ్‌ అలియాస్‌ పెయింటర్‌ సూరి ఇంట్లో పోలీసులు  సోదాలు చేశారు. కొన్ని సీడీలను, ఒక కంప్యూటర్‌ను సీజ్‌ చేశారు. 

శ్రవణ్‌ గదిలో క్షుణ్ణంగా వెతికారు. వారం రోజుల నుంచి శ్రవణ్‌ ఇంటికి రాకపోవడంతో అతని సోదరున్ని పట్టుకెళ్లారు. రాసలీలల సీడీని శ్రవణ్‌ ఇక్కడే తన కంప్యూటర్‌లో ఎడిటింగ్‌ చేయడంతో పాటు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కానీ ఈ వీడియో యూట్యూబ్‌లో రష్యా నుంచి పోస్ట్‌ అయినట్లు ఉండగా శ్రవణ్‌ ఖాతాను ఎవరో రష్యాలో హ్యాక్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు. అతని కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ ఓపెన్‌ కాకపోవడంతో దానినితో పాటు పలు సీడీలను, పెన్‌ డ్రైవ్‌లను ఇంటి కొనుగోలు కోసం తీసిపెట్టుకున్న రూ. 25 లక్షల డీడీని పోలీసులు తీసుకెళ్లారు. 

తుమకూరు జిల్లా శిరా తాలూకాలో ఉన్న భునవనహళ్లి గ్రామంలో సీడీ సూత్రధారిగా ఆరోపణలున్న నరేష్‌ గౌడ ఇంట్లో సోదాలు చేశారు. అతడు లేకపోవడంతో భార్యను ప్రశ్నించి వెళ్లిపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?