తన అన్నకు ప్రపంచంలోకెల్లా విలువైన బహుమతి ఇచ్చిన సోదరి..!

Published : Aug 30, 2023, 12:17 PM IST
 తన అన్నకు ప్రపంచంలోకెల్లా విలువైన బహుమతి ఇచ్చిన సోదరి..!

సారాంశం

ఏకంగా తన సోదరుడికి కిడ్నీ దానం చేసింది. ఈ అరుదైన సంఘటన జైపూర్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాఖీ పండగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. అమ్మాయిలందరూ తమ సోదరులందరికీ రాఖీలు కట్టి, వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. అయితే, ఈ రాఖీ పండగ సందర్భంగా ఓ యువతి  తన సోదరుడికి ప్రంపచంలో కెల్లా అరుదైన బహుమతిని అందించింది. ఏకంగా తన సోదరుడికి కిడ్నీ దానం చేసింది. ఈ అరుదైన సంఘటన జైపూర్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

40ఏళ్ల వ్యక్తి విదేశాల్లో సెటిల్ అయ్యాడు. అయితే,  తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం, విదేశాల నుంచి జైపూర్ కి వచ్చాడు. అయితే, అతను చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. అతనికి కచ్చితంగా కిడ్నీ మార్చితీరాలని వైద్యులు చెప్పారు.దీంతో, అతని సోదరి తన అన్న కోసం కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

ఈ రాఖీ పండగ సందర్భంగా అంతకన్నా గొప్ప బహుమతి తన అన్నకు తాను ఏమీ ఇవ్వలేను అంటూ, తన కిడ్నీ దానం చేసింది. జైపూర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె కిడ్నీని సోదరుడికి అమర్చారు. ఈ కిడ్నీ ట్రాన్సపరెంట్ సక్సెస్ అయ్యిందని వైద్యులు చెప్పారు. అతని వయసు 40 ఏళ్లుగా, అతని సోదరి వయసు 49ఏళ్లు కావడం విశేషం.

ఇదే ఆస్పత్రిలో తమ సోదరుల కోసం ఇలానే కిడ్నీలు దానం చేసిన ముగ్గురు సోదరీమణులు ఉన్నారని, ఇప్పుడు ఈ మహిళ కోసం  తన తమ్ముడికి  కిడ్నీ ఇచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఆ కిడ్నీ ఇవ్వకుంటే, అతని ప్రాణానికి ప్రమాదం అయ్యేదని, ఆమె ఇవ్వడం వల్లే అతను ప్రాణాలాతో బయటపడ్డాడు అని చెప్పారు.  ఈ సంఘటన స్థానికంగా వైరల్ అయ్యింది. తన సోదరుడిపై ఆమె చూపించిన ప్రేమకు అందరూ ఫిదా  అయిపోతున్నారు. వారి బంధం ఎప్పటికీ అలానే కలకలలాడాలని కోరుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?