బోద్‌గయా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..

Published : Aug 30, 2023, 12:00 PM IST
బోద్‌గయా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..

సారాంశం

బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్‌ను ఎస్‌యూవీ వాహనం ఢీకొన్న ఘటనలో  ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు.

బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్‌ను ఎస్‌యూవీ వాహనం ఢీకొన్న ఘటనలో  ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. బాధితులు బోద్‌గయా నుంచి స్వగ్రామమైన కురాని గ్రామానికి వెళ్తుండగా.. శివసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పఖ్‌నారీ గ్రామం సమీపంల ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారి 19పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు  మృతిచెందగా.. మరో ఐదుగురు  గాయపడ్డారు. 

మృతులను ఆదిత్య కుమార్ (8), రియా కుమారి (9), చాందిని కుమారి (15), తారా కుమారి (18), సోనీ కుమారి (35), రాజమతీ దేవి (50), అరవింద్ శర్మ (50)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని రీతూ శర్మ (14), దివ్య కుమారి (25), రవి నందన్ ప్రియదర్శి (30), ఉపేంద్ర శర్మ (30), సుదేశ్వర్ శర్మ (60)గా గుర్తించారు. వారు ప్రస్తుతం రోహతాస్‌లోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్‌హెచ్ఏఐ అధికారి నరేంద్ర పాండే  మాట్లాడుతూ..  ‘‘స్కార్పియో (ఎస్‌యూవీ) డ్రైవర్ బహుశా ఒక క్షణం కునుకు తీయడం.. ఈ విషాదకరమైన ప్రమాదానికి దారితీసింది. మేము రెస్క్యూ ఆపరేషన్ చేశాం గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి పంపాం’’ అని  తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే