నేటి నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం.. పాటించకపోతే రూ. 1 లక్ష వరకు జరిమానా?.. ఏయే వస్తువులపై బ్యాన్ అంటే?

Published : Jul 01, 2022, 04:03 PM ISTUpdated : Jul 01, 2022, 04:09 PM IST
నేటి నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం.. పాటించకపోతే రూ. 1 లక్ష వరకు జరిమానా?.. ఏయే వస్తువులపై బ్యాన్ అంటే?

సారాంశం

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం నేటితో అమల్లోకి వచ్చింది. రిజిడ్ ప్లాస్టిక్ ఐటమ్స్‌పై ఈ  నిషేధం అమలు చేయనున్నారు. అలాగే, 100 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ బ్యానర్లపై నిషేధం ఉంటుంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, గరిష్టంగా ఒక లక్ష రూపాయల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధించవచ్చు.

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఆదేశాలు నేటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిషేధాన్ని ఏకకాలంలో అమలు చేయడం కంటే.. దశల వారీగా అమలు చేయాలని కంపెనీలు, వాణిజ్య సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి నేరుగా చర్యలు తీసుకోవడానికి బదులు తొలుత ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే సంస్థలు, పంపిణీ, నిల్వ, అలాంటి వస్తువుల అమ్మకాలు జరిపే వాటిపై క్యాంపెయిన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించింది.

గతేడాది ఆగస్టులోనే కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ రూల్ 2021ను నోటిఫై చేసింది. 

ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్ ప్రకారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం నిషేధం. ఈ నిబంధన ప్రకారం ప్లాస్టిక్ ప్లేట్లు, కప్స్, గ్లాస్‌లు, రాపింగ్ లేదా ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు, 100 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న పీవీసీ బ్యానర్లు, స్ట్రాలు, ఇతర వస్తువులపై నిషేధం ఉంటుంది. 

సింగిల్ ప్లాస్టిక్  యూజ్ ఇండస్ట్రీ సుమారు రూ. 10 వేల కోట్ల విలువైనది. ఈ ఇండస్ట్రీ నేరుగా సుమారు రెండు లక్షల మందిని, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నది. 

కేంద్ర పర్యావరణ మంత్రి భూపిందర్ యాదవ్ ఈ నిర్ణయం గురించి మాట్లాడుతూ, ఎఫ్ఎంసీజీ పరిశ్రమ తమతో సహకరిస్తారని భావిస్తున్నట్టు వివరించారు. అలాగే, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీపై ఆధారపడి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రత్యామ్నాయ వస్తువుల తయారీ వైపు మారాలని సూచించారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామని, కానీ, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

అతిక్రమిస్తే.. 
ఈ నిబంధనను ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాాక్ట్ 1986 కింద ఈ రూల్ అతిక్రమించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష వేయవచ్చు. అంతేకాదు, రూ. ఒక లక్ష వరకు జరిమానా విధించవచ్చు. లేదా ఈ రెండు శిక్షలనూ వేయవచ్చు.

వీటిపై నిషేధం: 

  • సిగరెట్ ప్యాకెట్లు
  • కట్లరీ (అంటే ప్లేట్లు, కప్పులు, గ్లాస్‌లు, ఫోర్క్‌‌లు, స్పూన్‌లు, కత్తులు, ట్రేలు మొదలైనవి)
  • ఇయర్ బడ్స్
  • స్వీట్ బాక్సులు
  • క్యాండి లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్
  • ఇన్విటేషన్ కార్డులు
  • డెకరేషన్ పాలిస్టరిన్
  • 100 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ బ్యానర్లు

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!