మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

By Rajesh Karampoori  |  First Published May 19, 2024, 12:23 PM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆరు దేశాలకు చెందిన రాయబారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈశాన్య ఢిల్లీలో మోడీ ఆధ్వర్యంలో సాగిన సభకు వారంతా హాజరయ్యారు


PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. 

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ప్రధాని వారణాసి నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. అయితే ఆయన కోసం, బీజేపీని మరో సారి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రచారం చేయడానికి విదేశాల నుంచి రాయబారులు వచ్చారు. ఆరు దేశాలకు చెందిన రాయబారులు మోడీని మళ్లీ గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Latest Videos

ఇందులో నేపాల్ కు చెందిన రాయబారి పి శర్మ, అలాగే సింగపూర్ కు చెందిన హై కమిషనర్ తో పాటు 20 మంది దౌత్యవేత్తలు ప్రధాని మోడీ కోసం ప్రచారం నిర్వహించారు. వీరంతా ఈశాన్య ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ 7 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 

ఈ 7 స్థానాలకు ఒకే దేశలో ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. చాలా కాలం నుంచి ఢిల్లీపై పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఓ అవకాశంగా మారాయి. ఇక్కడి మెజారిటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగరాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీని బీజేపీ బరిలో నిలబెట్టింది. ఆయనపై కన్హయ్య కుమార్ కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్నారు. 

మనోజ్ తివారీని గెలిపిచేందుకు ప్రధాని మోడీ నిర్వహించిన సభలో ఆరు దేశాల రాయబారులు పాల్గొనడం జాతీయ మీడియాను ఆకర్శించింది. వారంతా బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ మరింత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. ఈశాన్య ఢిల్లీలో మనోజ్ తివారీని గెలిపించాలని కోరారు.

click me!