2014 నుంచి పౌరులకు గౌరవం, నాణ్యమైన జీవనం అందుతోంది - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

By team teluguFirst Published Feb 1, 2023, 4:28 PM IST
Highlights

2014 సంవత్సరం నుంచి దేశ ప్రజలకు మెరుగైన జీవన విధానం అందుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాలను మంత్రి వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కల్పించిందని, తలసరి ఆదాయం రెట్టింపు పెరిగి రూ.1.97 లక్షలకు చేరుకుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు..

ఈ తొమ్మిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత లాంఛనప్రాయంగా మారిందని నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) సభ్యత్వం రెట్టింపై 27 కోట్లకు చేరుకుందని ఆమె తెలిపారు. 2022లో యూపీఐ ద్వారా రూ.7,400 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

బడ్జెట్ ప్రసంగం పై ఇంటర్నెట్‌లో ఫన్నీ మీమ్స్‌.. ‘ఎవరి బాధలు వారివి’

2014 నుంచి మోడీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించారని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు నిర్మించిందని, ఉజ్వల కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు అందజేసిందని పేర్కొన్నారు. 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రభుత్వం అందజేసిందని, 47.8 కోట్ల పీఎం జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరిచిందని తెలిపారు.

భారతీయ సంస్కృతిలో ఐదుగురు పురుషులు కూడా భార్యను పంచుకోవచ్చు- టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధానమంత్రి సురక్ష బీమా, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా రక్షణ కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 11.4 కోట్ల మంది రైతులకు రూ. 2.2 లక్షల కోట్ల నగదు బదిలీ చేసినట్టు తెలిపారు. 

click me!