కేంద్ర బడ్జెట్ 2020: ఏప్రిల్ నుండి జీఎస్టీ పన్ను చెల్లింపు మరింత సులభతరం

By narsimha lodeFirst Published Feb 1, 2020, 2:12 PM IST
Highlights

ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండి జీఎస్టీ పన్ను చెల్లింపును మరింత సులభతరం చేయనున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 


న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండి సులభతరమైన జీఎస్టీ పన్ను  చెల్లింపు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

శనివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగ సమయంలో  జీఎస్టీ పన్ను చెల్లింపుల గురించి ఆమె ప్రస్తావించారు.ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా జీఎస్టీ అమలైన విషయాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Also read:కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

దేశంలో 14 కోట్ల జీఎస్టీ రిటర్న్స్‌ నమోదు చేసినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా ప్రకటించారు.. జీఎస్టీ కౌన్సిల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్టీ నమోదు మరింత సరళతరం కానుందని మంత్రి ప్రకటించారు. 

 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అందడం లేదని.. రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు వెళ్తున్నాయని.. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్క గృహ వినియోగదారుడు ప్రతి నెల 4 శాతం జీఎస్టీ కారణంగా పొదుపు చేసినట్టుగా మంత్రి తెలిపారు.  
 
 

click me!