కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు

By narsimha lode  |  First Published Feb 1, 2020, 1:15 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్ఐసీ ప్రైవేటీకరణ ధిశగా చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రకటించారు. 



న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్ఐసీలో పాక్షికంగా ప్రభుత్వం తన వాటాలను విక్రయించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

శనివారంనాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ‌ఎల్ఐసీలో వాటాలను విక్రయించేందుకు  నిర్ణయం తీసుకొన్నట్టుగా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Latest Videos

undefined

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగంలో ఉన్న భీమా సంస్థగా ఎల్ఐసీ గుర్తింపు పొందింది. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాను పాక్షికంగా విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  

ఎల్ఐసీలో ప్రభుత్వం పాక్షికంగా తన వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడంపై ఎల్ఐసీ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయమై విపక్షాలు ఏ రకమైన వైఖరిని తీసుకొంటాయో చూడాలి.
 

click me!