ఎన్నికల వేళ.. కారులో రూ. 39 లక్షల విలువైన వెండి స్వాధీనం.. ఆ కారు సినీ నిర్మాత బోనీకపూర్‌ దేనా!?

Published : Apr 08, 2023, 04:14 PM IST
ఎన్నికల వేళ.. కారులో రూ. 39 లక్షల విలువైన వెండి స్వాధీనం.. ఆ కారు సినీ నిర్మాత బోనీకపూర్‌ దేనా!?

సారాంశం

కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు విచారణలో ఓ కారులోంచి రూ.39 లక్షల విలువైన 66 కిలోల వెండి పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు డ్రైవర్‌ను వెండికి సంబంధించిన పత్రాలు అడగగా.. డ్రైవర్ ఎలాంటి పత్రాలు ఇవ్వలేకపోయాడు. అనంతరం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి చిత్రనిర్మాత బోనీ కపూర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొద్దీ రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ముమ్మరంగా తనిఖీలు చేస్తుంది. ఈ తనిఖీలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కు చెందిన కారు సీజ్ చేయబడింది. ఆ కారులో లక్షల విలువైన వెండి వస్తువులను అధికారులు గుర్తించడం చర్చనీయం. 

కర్నాటకలో ఎన్నికల సంఘం అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.39 లక్షల విలువైన వెండి పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాత్రలు చిత్రనిర్మాత బోనీ కపూర్‌కు చెందినవని చెబుతున్నారు. చెన్నై నుంచి ముంబైకి బీఎండబ్ల్యూ కారులో వెండి వస్తువులు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రలను ఐదు పెట్టెల్లో నింపారు. అధికారులను విచారించగా అందుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లభించలేదు.

సమాచారం ప్రకారం.. ఎన్నికల సంఘం (ఈసీఐ) చేస్తున్న తనిఖీల్లో శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని దావణగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని ఓ కారును నిలిపివేశారు. ఈ సందర్భంగా  ఆ కారు నుంచి రూ.39 లక్షల విలువైన 66 కిలోల వెండి పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాత్రలను ఐదు పెట్టెల్లో నింపారు. ఆ  బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుంచి ముంబైకి తీసుకువెళుతున్నారు.

విచారణలో అధికారులు కారు డ్రైవర్‌ను పాత్రలకు సంబంధించిన పత్రాలు అడగగా.. ఇవ్వలేకపోయాడు. ఎన్నికల సంఘం అధికారులు వెండి గిన్నెలు, చెంచాలు, నీటి మగ్గులు, ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు డ్రైవర్ సుల్తాన్ ఖాన్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న హరిసింగ్ అనే వ్యక్తిపై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వెండి వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవా?

ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేయగా, BMW కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేయబడినట్లు తేలింది. విచారణలో వెండి వస్తువులు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవని హరి సింగ్ అంగీకరించాడు. సంబంధిత పత్రాలు సమర్పించని వెండి పాత్రలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి పాత్రలు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనా అనే కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu