కరోనా: గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌పై మార్గదర్శకాలు జారీ

By narsimha lodeFirst Published May 16, 2021, 3:42 PM IST
Highlights

అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్ష కిట్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై కేంద్రం ఆదివారం నాడు మార్గదర్శకాలను జారీ చేసింది.  కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. 

న్యూఢిల్లీ:అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్ష కిట్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై కేంద్రం ఆదివారం నాడు మార్గదర్శకాలను జారీ చేసింది.  కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.  ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు కరోనా రోగులకు సేవలు అందించాలని కోరింది.   అన్ని గ్రామాల్లో ఆక్సిమీటర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. 

గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస ఇబ్బందులు ఉన్నవారిపై నిఘా పెట్టాలని కేంద్రం సూచించింది. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని ఆదేశించింది.  గ్రామీణప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో  30 పడకల ఆసుపత్రులను  సిద్దం చేయాలని సూచించింది. 

కరోనా లక్షణాలు కలిగినట్టుగా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ఇతరులతో కలకుండా నిలువరించాలని కేంద్రం ఆ గైడ్‌లైన్స్ లో స్పష్టం చేసింది.  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో టెలి కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రోగులను పరీక్షించాలని కేంద్రం కోరింది. తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను ఆసుపత్రులకు పంపాలని సూచించింది. 
 

click me!