టౌటే తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష: మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల సీఎంలతో చర్చ

By narsimha lodeFirst Published May 16, 2021, 3:16 PM IST
Highlights

టౌటే తుఫాన్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

న్యూఢిల్లీ: టౌటే తుఫాన్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  టౌటే తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అమిత్ షా నేతృత్వంలో ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.  తుఫాన్ ప్రభావంపై అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో చర్చించారు. 

కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రతీర ప్రాంతమంతా వణికిపోతోంది.  ఈ వర్షాలతో ఇప్పటికే నలుగురు కర్ణాటక రాష్ట్రంలో మరణించారు. కేరళలో ఇద్దరు చనిపోయారు.  కర్ణాటక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 73 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  కర్ణాటకలోని ఎత్తైన, గుట్టల ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

also read:టౌటే ఎఫెక్ట్:కేరళలో భారీ వర్షాలు, అరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. టౌటే తుఫాన్ గురించి చర్చించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకొంటున్న చర్యలపై ఆరా తీశారు.  గుజరాత్ రాష్ట్రంలో కూడ ఈ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్,డియూ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  16 ఎయిర్ క్రాఫ్ట్స్ ను సిద్దం చేసింది. మరో 18 హెలికాప్టర్లను  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు అందుబాటులో ఉంచింది. 


 

click me!