Sidhu Moose Wala murder : సిద్ధూ మూస్ వాలా హత్య కేసు.. గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

Published : Jun 10, 2022, 12:46 AM IST
Sidhu Moose Wala murder : సిద్ధూ మూస్ వాలా హత్య కేసు.. గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు

సారాంశం

సిద్దూ మూస్ వాలా హత్య కేసులో ప్రమేయం ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మరో ముందడుగు వేశారు. ఈ హత్యకు బాధ్యత వహించిన గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీని వల్ల ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న నిందితుడిని అధికారికంగా భారత్ కు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. 

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకేసులో సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు (RCN ) జారీ చేసింది. అత‌డు ప్ర‌స్తుతం విదేశాల్లో నివసిస్తున్నాడు. ఇలా RCN జారీ చేసిన‌ప్పుడు అత‌డిని భారతదేశానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభమవుతుంద‌ని CBI సీనియర్ అధికారి తెలిపారు. ఈ మేర‌కు ఆ అధికారి వార్తా సంస్థ ఏఎన్ ఐతో మాట్లాడారు. ‘‘ RCN జారీ అయ్యింది కాబట్టి CBI లైజన్ అధికారి ఇంటర్‌పోల్‌తో సమన్వయం చేసుకుంటారు. అతడిని భారత్ కు అప్పగించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ప్రతిపాదనను పంపుతారు.’’ అని పేర్కొన్నారు. 

Jammu and Kashmir : జ‌మ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త‌త.. భ‌ద‌ర్వాలో క‌ర్ప్యూ.. ఫ్లాగ్ మార్చ్ కు పిలుపు..

అంతకు ముందు రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు పంజాబ్ పోలీసులు గోల్డీ బ్రార్‌పై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సిఎన్) ఎందుకు జారీ చేయాలో వివ‌ర‌ణ ఇచ్చింది. మే 30వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి త‌మ‌కు ఈ-మెయిల్ ద్వారా ఆర్ సీఎన్ జారీ చేయాల‌ని కోరిన‌ట్టు సీబీఐ తెలిపింది. అయితే జూన్ 2వ తేదీన రెడ్ నోటీసు ప్రతిపాదనను వెంటనే లియోన్‌లోని ఇంటర్‌పోల్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపించిన‌ట్టు పేర్కొంది. అంతర్జాతీయ సహకారం విషయంలో అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సీబీఐ స‌హాయం చేస్తోంద‌ని తెలిపింది. వివిధ అంతర్జాతీయ మార్గాల ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సహాయం చేయడానికి కట్టుబడి ఉందని సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 

రెండు కేసుల ఆధారంగా గోల్డీ బ్రార్‌పై రెడ్ కార్నర్ నోటీసు ప్రతిపాదనను పంపార‌ని నివేదిక‌లు తెలిపాయి. మొదటి కేసులో 2020 నవంబర్ 12న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, రెండో కేసులో 2021 ఫిబ్రవరి 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ రెండు కేసులు సిటీ ఫరీద్ కోట్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. హ‌త్య, నేరపూరిత కుట్ర మరియు అక్రమ ఆయుధాల సరఫరా, హత్యాయత్నం, నేరపూరిత కుట్రతో అక్రమ ఆయుధాల సరఫరా వంటి అభియోగాలు ఉన్నాయి. 

rajya sabha election 2022 : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంవీఏకు ఎదురుదెబ్బ‌.. ఇద్ద‌రు నేత‌ల‌కు బెయిల్ తిర‌స్క‌ర‌ణ

కాగా గత‌ ఏడాది యువ అకాలీ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య జ‌రిగింది. అయితే ఈ విష‌యంలో గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో సింగ‌ర్ సిద్దూ మూస్ వాలా హత్యకు గోల్డీ బ్రార్ త‌మ‌దే బాధ్య‌త అని పేర్కొన్నాడు అందుకే అత‌డిని ఇండియాకు తీసుకురావ‌డానికి అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూస్ వాలా హత్యకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితులపై కిరోసిన్ పోసి నిప్పంటించిన స్థానికులు

ప్ర‌స్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను సిద్దూ మూస్ వాలా హ‌త్య కేసులో ప్రధాన సూత్రధారిగా పోలీసులు బుధవారం పేర్కొన్నారు. ఇంతకు ముందు చాలాసార్లు అత‌డిని ప్రశ్నించగా, బిష్ణోయ్ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ఖండించాడు. కానీ తాజాగా పోలీసులు వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం.. త‌న ముఠానే ఈ హ‌త్య‌కు కుట్ర‌ప‌న్ని దానిని అమ‌లు చేసింద‌ని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu