
జమ్మూ కాశ్మీర్ లోని భదర్వాలో ఉద్రికత్త నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అలాగే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించేందుకు ఇండియన్ ఆర్మీని పిలిచారు. సోషల్ మీడియాలో పోస్ట్ వల్ల ఈ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భదర్వాలో ఉద్రిక్తతకు ఓ సోషల్ మీడియాలో పోస్ట్ కారణమైంది. నిందితులపై భదర్వా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. భదర్వాలోని ఒక మసీదు నుంచి రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్న వీడియోనే దీనికి కారణమైందని పేర్కొన్నారు.
మరోవైపు ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను ఫైజాన్ అహ్మద్ పాల్, ముజామిల్ రషీద్ మీర్‌గా గుర్తించారు. వీరు కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ‘‘ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లో ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాం. వారిని ఫైజన్ అహ్మద్ పాల్, ముజామిల్ రషీద్ మీర్‌లుగా గుర్తించాం. వారు కశ్మీర్ లోయలో LeT/TRF కోసం పనిచేస్తున్నారు ’’ అని పేర్కొన్నారు.